లవ్ స్టోరీ రికార్డ్‌ ను ఎగరేసుకు పోయిన అరవ సినిమా

ఈ ఏడాది కరోనా వల్ల బాలీవుడ్ బాక్సాఫీస్ పూర్తిగా మూత పడింది.సినిమా థియేటర్లు ఈ ఏడాదిలో 90 శాతం రోజులు మూతపడే ఉన్నాయి.

ఆమద్య రెండు మూడు వారాలు ఓపెన్ చేసిన వెంటనే కరోనా సెకండ్‌ వేవ్‌ అంటూ మొదలు అయ్యి మళ్లీ మూత పడ్డాయి.

ఆ సమయంలో ఉత్తర భారతంలో కొన్ని రాష్ట్రాల్లో థియేటర్ల తలుపులు కూడా తెరవలేదు.

చాలా చోట్ల ఏడాదిన్నర కాలంగా సినిమా థియేటర్లు మూత పడే ఉన్నాయి.కాని సౌత్ లో పరిస్థితి అలా లేదు.

ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి సందర్బంగా వచ్చిన సినిమాలు దుమ్ము రేపాయి.ఉప్పెన వంటి సినిమా వంద కోట్ల రూపాయలను రాబట్టింది అంటే ఏ రేంజ్ లో సినిమా వసూళ్లు సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక సెకండ్‌ వేవ్ తర్వాత ఇండియాలో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న సినిమా గా లవ్‌ స్టోరీ నిలిచింది.

చైతూ సాయి పల్లవిల లవ్‌ స్టోరీకి మొన్నటి వరకు ఉన్న రికార్డు ను వరుణ్ డాక్టర్‌ ఎగరేసుకు పోయాడు.

"""/"/ తమిళ మూవీ అయిన వరుణ్‌ డాక్టర్ ను తెలుగు లో కూడా విడుదల చేయడం జరిగింది.

తెలుగులో ఎవరు పట్టించుకోవడం లేదు.కాని ఈ సినిమాను తమిళంలో మాత్రం విపరీంగా చూస్తున్నారు.

ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా అక్కడ రివ్యూలు దక్కించుకుంది.అందుకే అక్కడి ఆడియన్స్ చాలా నెలల తర్వాత థియేటర్లకు క్యూ లు కట్టారు.

రికార్డు స్థాయిలో వసూళ్లను వరుణ్‌ డాక్టర్ దక్కించుకుంటున్నాడు.శివ కార్తికేయన్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఒక మంచి కాన్సెప్ట్‌ తో రూపొందింది.

కనుక ఈ రేంజ్ లో వసూళ్లు నమోదు అవుతున్నాయి.మొదటి పది రోజుల్లో ఈ సినిమా 50 కోట్లను క్రాస్ చేసింది.

లవ్‌ స్టోరీ సినిమా వసూళ్లను ఈ సినిమా చాలా ఈజీగా క్రాస్ చేసింది.

తెలుగు లో ఈ సినిమా వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి.మొత్తానికి లవ్‌ స్టోరీ కి దక్కిన రికార్డు ఇలా వెళ్లి పోవడం కాస్త విచారకరం.

.

పవన్ కళ్యాణ్ పెద్దగా ఈవెంట్స్ కి రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా..?