ఫేస్‌బుక్‌లో ల‌వ్‌.. చివ‌ర‌కు అత‌ని ప్రాణం మీద‌కు తెచ్చింది..

ఆన్‌లైన్ ప్రేమ క‌థ‌లు ఇప్పుడు చాలా కామ‌న్ అయిపోయాయి.ముక్కు ముఖం తెలియ‌ని వారిని ప్రేమించేసి ఆ త‌ర్వాత స‌మ్య‌ల‌ను కొని తెచ్చుకుంటున్న ఘ‌ట‌న‌లు ఈ మ‌ధ్య కోకొల్ల‌లు అయిపోయాయి.

అయితే అబ్బాయి మోస‌పోవ‌డం లేదంటే అమ్మాయి మోస‌పోవ‌డం లాంటివి చూస్తూనే ఉన్నాం.తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింది.

ఇద్ద‌రూ ఫేస్‌బుక్‌లో ప్రేమించుకుని క‌లుద్దామ‌నుకున్నారు.ఇందుకోసం వేసుకున్న ప్లాన్ కాస్తా యువ‌కుడి ప్రాణాల మీద‌కు తెచ్చింది.

ఈ ఘ‌ట‌న విజ‌య‌వాడ‌లో తీవ్ర క‌ల‌కలం రేపింది.వివ‌రాలేంటో తెలుసుకుందాం.

బెజవాడ ప్రాంతంలోని భవానీపురంలో నివ‌సించే యార్ల గడ్డ డేవిడ్ జాబ్ చేస్తూ జీవిస్తున్నాడు.

అయితే అత‌నికి ఎక్కువ‌గా ఫేస్‌బుక్‌లో గ‌డిపే అలవాటు కార‌ణంగా హైదరాబాద్ లోని సాఫ్ట్‌వేర్ సంస్థ‌లో ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్న‌టువంటి కంకిపాడు ఏరియాకు చెందిన ఒక అమ్మాయితో ప‌రిచ‌యం ఏర్ప‌డిది.

రెండేండ్లుగా వీరి మ‌ధ్య చాటింగ్ న‌డుస్తోంది.ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం కాస్తా ప్రేమగా మారింది.

ఇంకేముంది వీరు రీసెంట్ గా క‌లుద్దామ‌ని అనుకున్నారు.అయితే యువ‌కుడిని అమ్మాయి త‌న మామయ్య ఇంటికి రావాలంటూ కోరింది.

ఇక అమ్మాయి ర‌మ్మంది కాబ‌ట్టి అత‌ను వెంట‌నే త‌న కారులో బయలుదేరిన ఆమె చెప్పిన చోటుకు వెళ్లాడు.

అక్క‌డ‌కు వెల్లిన త‌ర్వాత అమ్మాయికి ఫోన్ చేసి ఎక్క‌డున్నావో అడ్ర‌స్ చెప్ప‌మ‌ని కోరితే ఆమె త‌న బ్ర‌ద‌ర్స వ‌చ్చి తీసుకొస్తారని వివ‌రించింది.

అయితే అమ్మాయి సోదరులుగా వ‌చ్చి ఆ వ్య‌క్తిని కారులో కిడ్నాప్ చేసి దారి లోనే బ్లేడ్ తో తీవ్రంగా గాయ‌ప‌రిచారు.

అత‌ని మెడతో పాటు, చేతుల్ని కూడా దారుణంగా కోసేశారు.తీవ్ర ర‌క్త‌స్రావంతో ఉన్న అత‌న్ని రోడ్డుపై ప‌డేశారు.

అతని ద‌గ్గ‌రున్న విలువైన వ‌స్తుల‌ను లాక్కున్నారు.స్థానికులు అత‌న్ని ఆస్ప‌త్రిలో జాయిన్‌ చేయ‌గా పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

బీఆర్ఎస్ కు మరో కీలక నేత రాజీనామా