ఉత్తమ్ పై ప్రేమ.. ఎందుకో ?

టి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy )పై గత కొన్నాళ్లుగా రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి.

ఆయన పార్టీ మారే అవకాశం ఉందని ఉత్తమ్ కు అధిష్టానం తగిన ప్రదాన్యం ఇవ్వడం లేదని ఇలా కొన్ని వార్తలు ఎక్కువగా వినిపించాయి.

ఇంకా చెప్పాలంటే సొంత పార్టీ నేతలే ఈ రకమైన రూమర్స్ పుట్టిస్తున్నారని పలు మార్లు ఉత్తమ్ కూడా చెప్పుకొచ్చారు.

అయితే తాను ఎలాంటి పార్టీ మారే ప్రసక్తే లేదని ఘంటాపథంగా స్పష్టం చేశారు ఉత్తమ్ అయినప్పటికి ఇలాంటి రూమర్స్ మాత్రం ఆగలేదు.

అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఈ రకమైన వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అధిష్టానం ఎవరు ఉఃహించని విధంగా రాష్ట్ర ఎన్నికల కమిటీలో ఉత్తమ్ కు చోటు కల్పించింది.

"""/" / దాంతో ఆయనకు కాంగ్రెస్ లో ప్రదాన్యం తగ్గిందనే వార్తలకు చెక్ పడినట్లైంది.

ఇక ఆ తరువాత ఆయన హుజూర్ నగర్( Huzur Nagar ) ఆయన బార్య పద్మావతి రెడ్డి కోదాడ నుంచి పోటీ చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు.

అయితే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి టికెట్లు కేటాయించడం కుదరదని రేవంత్ రెడ్డి తెగేసి చెప్పారని వార్తలు వచ్చాయి.

దాంతో ఉత్తమ్ మరియు రేవంత్ రెడ్డి మద్య మరోసారి వివాదం బయటపడింది.ఒకవేళ ఇద్దరికీ టికెట్ కేటాయించకపోతే ఉత్తమ్ కాంగ్రెస్ విడతారని మళ్ళీ వార్తలు గుప్పుమన్నాయి.

బి‌ఆర్‌ఎస్( BRS Party ) తో మంతనాలు చేస్తునట్లు కూడా పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపించాయి.

"""/" / అయితే మళ్ళీ ఇలా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈసారి ఉత్తమ్ ను ఏకంగా జాతీయ ఎన్నికల కమిటీలోకి తీసుకొని మరోసారి ఆసక్తికరమైన చర్చకు తెర తీసింది.

ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మరబోతున్నాడని వార్తలు వచ్చిన ప్రతిసారి అధిష్టానం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏదో ఒక పదవి కట్టబెడుతూనే ఉంది.

పార్టీలో సీనియర్ నేతలు ఎంతమంది ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్ల మాత్రం అధిష్టానం మాత్రం సానుకూలంగానే స్పష్టమౌతోంది.

కాగా ప్రస్తుతం తనకు తన బార్య కు రెండు సీట్లను ఉత్తమ్ ఆశిస్తున్న వేల.

ఇదే ప్రేమతో అధిష్టానం ఆయనకు రెండు సీట్లు కట్టబెడుతుందా ? లేదా అనేది చూడాలి.

ఆస్ట్రేలియా బౌలర్లకు తాట తీసిన జైస్వాల్.. దిగ్గజాల సరసన చోటు