లూయీ బెయిలీ జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శం…!

నల్లగొండ జిల్లా:అంధుల అక్షర ప్రధాత లూయీ బ్రెయిలీ 215వ,జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని సంక్షేమ అధికారి కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకల్లో ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకొనిసంబురాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథులుగా జిల్లా సంక్షేమ అధికారిణి కెవి కృష్ణవేణి,జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పిడి కాలింది హాజరై మాట్లాడుతూ అంధ సమాజం కోసం లూయీ బ్రెయిలీ ముందుచూపు స్ఫూర్తిదాయకమని,తన కంటి చూపును కోల్పోయినప్పటికీ సమాజం పట్ల ముందు చూపుతో ఆలోచించిన ఆయన యొక్క జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శమని కొనియాడారు.

తాను 175 ఏళ్ల క్రితం చనిపోయినప్పటికీ నేటికీ సమాజంలో సజీవంగా ఉన్నారన్నారు.తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని ప్రోత్సహించడం జరుగుతుందని,వివాహ ప్రోత్సాహకాలు బస్సు పాసులు,పెన్షన్లు మొదలగు సదుపాయాలను, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా ఉత్తమ అంధ ఉద్యోగికి బాలయ్యను సన్మానించారు.ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు క్రాంతి కుమార్,సైదులు,మహిళా శిశు సంక్షేమ దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ సిబ్బంది శ్రీహరి,వెంకట్ రెడ్డి,నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈటెల రాజేందర్ కు ఆ పదవి ఫిక్స్ కాబోతోందా ?