లాస్ ఏంజిల్స్‌లో ఆగని మంటలు.. ఒక్కసారిగా DC-10 ట్యాంకర్ ప్రత్యక్షం.. తర్వాతేమైందో చూడండి!
TeluguStop.com
కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్( Los Angeles ) సిటీ ఇప్పుడు అత్యంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది.
నగర సమీపంలో చెలరేగిన భారీ కార్చిచ్చు( Wildfire ) ఊహించని విధంగా విస్తరిస్తోంది.
"పాలిసైడ్స్ ఫైర్"గా పిలుస్తున్న ఈ మంటలు, నగర శివారు ప్రాంతమైన బ్రెంట్‌వుడ్‌ను( Brentwood ) కూడా చుట్టుముట్టాయి.
గంటల వ్యవధిలో దాదాపు 1,000 ఎకరాలకు పైగా విస్తరించడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది.
ఈ విపత్తు దేశంలోనే అతిపెద్ద, అత్యంత ప్రాణాంతకమైన కార్చిచ్చుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
మంటలను కంట్రోల్ చేయడానికి అగ్నిమాపక సిబ్బంది శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.ఆకాశం నుంచి నీటిని, మంటలను ఆర్పే రసాయనాలను ట్యాంకర్ల ద్వారా కుమ్మరిస్తున్నారు.
ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మెక్‌డొనెల్ డగ్లస్ సంస్థ తయారు చేసిన DC-10 ఎయిర్ ట్యాంకర్ దాదాపు 10,000 గ్యాలన్ల రెడ్ కలర్ కెమికల్‌ను మంటలు వ్యాపించిన కొండలపై గుమ్మరించింది.
బోయింగ్ 747 విమానంలాగే ఉండే ఈ ట్యాంకర్, తక్కువ నిడివి గల రన్‌వేలపై కూడా ల్యాండ్ అవ్వగలగడం విశేషం.
"""/" /
మంటలు ఎగిసిపడుతున్న దిక్కును అనుసరించి పైలట్ చాలా జాగ్రత్తగా ఆ రసాయనాన్ని కొండపై చల్లాడు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కొలిన్ రగ్ అనే వ్యక్తి నిన్న రాత్రి మంటలు భారీగా ఎగిసిపడటంతో పరిస్థితి మరింత దిగజారిందని పేర్కొన్నాడు.
ఈ కార్చిచ్చు ఇప్పటికే అనేక మంది ప్రాణాలను బలిగొంది.మొత్తంగా 16 మంది మరణించగా, వారిలో 11 మంది ఈటన్ ఫైర్‌లో, మరో 5 మంది పాలిసైడ్స్ ఫైర్‌లో చనిపోయారు.
స్థానిక సిబ్బందికి సహాయం చేయడానికి మెక్సికో, కెనడా దేశాల నుంచి కూడా అగ్నిమాపక సిబ్బంది, ఎయిర్ ట్యాంకర్లు చేరుకున్నాయి.
బీబీసీ ఈ విషయాన్ని తెలిపింది. """/" /
లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా మాట్లాడుతూ, శిథిలమైన ప్రాంతాల్లో బాధితుల కోసం 40కి పైగా సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లు, ప్రత్యేక శిక్షణ పొందిన కుక్కలతో గాలిస్తున్నట్లు తెలిపారు.
ఇంకా పూర్తిగా గాలించని ఇళ్లలో మరిన్ని మృతదేహాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఈ విపత్తు అనేక మంది ప్రముఖుల జీవితాల్లోనూ విషాదం నింపింది.నటి పారిస్ హిల్టన్, మాండీ మూర్, ప్రముఖ హాస్య నటుడు బిల్లీ క్రిస్టల్, నటి మెలిస్సా రివర్స్ వంటి వారి ఇళ్లు కూడా ఈ మంటల్లో కాలి బూడిదయ్యాయి.
ఈ దుర్ఘటన నగరాన్ని, దాని పరిసర ప్రాంతాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.కళ్ల ముందే తమ ఆస్తులు, బంధువులు కాలిపోతుండటంతో ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఈ ఘటన యావత్ కాలిఫోర్నియాను విషాదంలోకి నెట్టింది.
స్టీవ్ జాబ్స్ భార్య మహాకుంభమేళాలో ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!