జాతీయ రహదారి టోల్ గేట్ లో లారీ భీభత్సం.. !

ప్రమాదాలు ఎవరికి చెప్పిరావు.అందులో రోడ్దు మీద ప్రయాణించే వారి వెంట ఎప్పుడు మృత్యువు నీడలా ఉంటుంది.

అందుకే అంటారు బయటకు వెళ్లిన వ్యక్తి ఇంటికి వచ్చే వరకు నమ్మకం తక్కువ అని.

ఇకపోతే రహదారులు ఎక్కువగా దాహంతో అల్లాడిపోతుంటాయి కావచ్చూ.అందుకే ప్రమాదాల రూపంలో రక్తాన్ని తాగుతుంటాయి.

ఇకపోతే వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం పరిధిలోని ముత్తోజిపేట శివారులో జాతీయ రహదారి 365 టోల్ గేట్ దగ్గర ఓ లారీ బీభత్సం సృష్టించింది.

మల్లంపల్లి నుండి నర్సంపేట వైపుగా రోలర్ వీల్స్ తో బయలుదేరిన ఓ లారీ, సరిగ్గా హనుమాన్ తండా సమీపంలో గల టోల్ గేట్ దగ్గరికి చేరుకోగానే ప్రమాదానికి గురైంది.

"""/"/ ఆ లారీ ఒక్కసారిగా కుదుపులకు లోనవగా, రోలర్ వీల్స్ కు కట్టిన తాళ్లు తెగిపోయాయి.

దీంతో ఆ రోలర్ వీల్స్ పక్కకు ఒరిగి టోల్ గేట్ లో టికెట్లు ఇచ్చే క్యాబిన్ పై పడిపోవడంతో క్యాబిన్ మొత్తం ధ్వంసం అయింది.

అదీగాక పక్కనే ఉన్న ఓ కారుపై కూడా పడటంతో ఆ కారు కూడా డ్యామేజ్ అయ్యిందట.

కాగా ఈ ప్రమాదంలో బానోతు అశోక్ అనే వ్యక్తి ,క్యాబిన్ లోనే చిక్కుకుపోగా, వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రున్ని బయటకు తీశారు.

ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితుణ్ణి ఆస్పత్రికి తరలించారు.సంఘటన పై విచారణ చేస్తున్నారు.

నా మాటలను తప్పుగా అపార్థం చేసుకున్నారు… ట్రోల్స్ పై స్పందించిన అనిల్ రావిపూడి!