అప్పుడు లారీ ఓనర్.. ఇప్పుడు 11 స్క్రీన్లకు అధిపతి.. ఇతని సక్సెస్ స్టోరీ వింటే వావ్ అనాల్సిందే!

కష్టే ఫలి అన్నారు పెద్దలు.అంటే కష్టపడితే ఫలితం దానంతట అదే లభిస్తుంది.

అలాగే కష్టపడితే సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు.

అందుకే ఎన్ని అపజయాలు ఎదురైనా, ఒడిదుడుకులు ఎదురైనా కష్టాలు ఎదురైనా ఆ ఓడిపోకుండా, నిరాశ చెందకుండా ధైర్యంగా ముందుకు వెళ్లినప్పుడే సరైన సక్సెస్ ను సాధించగలం అని చెబుతూ ఉంటారు.

అలా ఇప్పుడు మన రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి కూడా మంచి విజయం సాధించి ప్రతి ఒక్కరు కూడా తన గురించి మాట్లాడుకునేలా చేశారు.

ఒకప్పుడు లారీ ఓనర్ గా ఉన్న ఆయన ఇప్పుడు ఏకంగా 11 స్క్రీన్ లకు అధిపతి అయ్యారు.

ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి సక్సెస్ వెనుక ఉన్న కారణం ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.

"""/" / అతను మరెవరో కాదు మన రాష్ట్రానికి చెందిన రాఘవరాజు మణిరాజు( Raghavaraju Maniraju ).

తిరుపతి జిల్లా వడమాలపేట మండలం శ్రీబొమ్మరాజపురం గ్రామ ( Sribommarajapuram Village )సర్పంచి.

35 ఏళ్లుగా తెలుగుదేశం వీరాభిమానిగా కూడా ఉన్నారు.అంతేకాకుండా 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైకాపా అరాచకాలకు ఎదురొడ్డి ఎన్నికైన సర్పంచుల్లో ఆయన ఒకరు.

45 ఏళ్ల క్రితం.అంటే 1979లో ఒక్క లారీతో జీవనం ఆరంభించిన ఆయన రవాణా రంగంలో విస్తరిస్తూ టిప్పర్లు, పొక్లెయిన్లు సమకూర్చుకున్నారు.

కష్టాన్ని నమ్ముకుని అంచెలంచెలుగా ఎదుగుతూ 2013లో నవీ ముంబయిలోని సొంత భవనంలో నాలుగు స్క్రీన్లతో మల్టీప్లెక్స్‌ ప్రారంభించారు.

అద్దె భవనాల్లో మరో ఏడు స్క్రీన్లు ఏర్పాటుచేశారు. """/" / ఈ సినిమా హాళ్లు తెలుగువాళ్లవనే గుర్తింపు కోసమే ఈ రంగంలోకి అడుగుపెట్టా అని మణిరాజు తెలిపారు.

శ్రీవెంకటేశ్వర ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ( Srivenkateswara Infra Projects )పేరుతో నిర్మాణ పనులూ చేస్తున్న ఆయనకు, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఒకవైపు తను కష్టపడుతూనే తన సొంత గ్రామంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.పేద కుటుంబాలకు చెందినవారు మరణిస్తే రూ.

5 వేల చొప్పున ఆర్థిక సాయంతో పాటు వైకుంఠ రథం ఏర్పాటు చేశారు.

అలా ఎన్నో కష్టాలను అనుభవించిన ఆయన నేడు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు.

ముఖం మొత్తం మచ్చలేనా.. ఖరీదైన క్రీముల కంటే ఎఫెక్టివ్ గా పనిచేసే రెమెడీ మీకోసం!