బాబోయ్.. అక్కడ శివుడికి సిగరెట్లతో పూజలు చేస్తున్నారట!?

ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా? నిజం అండి బాబు.అక్కడ నిజంగానే సిగిరెట్లతో శివుడికి పూజలు చేస్తారట.

ఎక్కడ అనుకుంటున్నారా? హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఓ శివాలయంలో ఇలా పూజలు చేస్తారు.

సాధారణంగా అయితే శివలింగానికి అభిషేకాలు, పూలు, పళ్లు సమర్పించి దీపాలు వెలిగించి అగరుబత్తులు వెలిగిస్తారు.

కానీ హిమాచల్ ప్రదేశ్ లోనే బిన్నంగా సిగిరెట్లతో శివుడికి అభిషేకం చేస్తారు.ఇంకా ఈ శివాలయంలో ఈ వింత ఆచారం ఎన్నో ఏళ్ళ నుండి కొనసాగుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలోని లూట్రా మహాదేవ్‌ ఆలయంలో కొలువైన శివ లింగానికి ఇలా సిగిరెట్లతో పూజలు చేస్తారు.

ఇక్కడికి వచ్చిన భక్తులు అంత కూడా సిగరెట్లు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.అంతే కాదు.

ఇక్కడ భక్తులకు మరో విశ్వాసం కూడా ఉంది.అది ఏంటి అంటే? సిగరెట్లను గర్భ గుడిలోని శివలింగంపై ఉంచగానే వాటంతట అవే వెలుగుతాయి అని భక్తులు నమ్ముతుంటారు.

వారు నమ్మినట్టుగానే ఆ సిగరెట్లు కూడా వెలుగుతాయట.అయితే దీని వెనుక మిస్టరీ ఏంటి అనేది ఇంతవరకు బయటకు రాలేదు.

ఏప్రిల్ 19న జరుపుకునే కామాద ఏకాదశి ప్రాముఖ్యత ఇదే..!