గణేశుడికి ఆవు నెయ్యి తో కలిపిన సింధూరం దిద్దితే ఏమౌతుందో తెలుసా?

బుధవారం గణేశునికి ఎంతో ప్రీతికరమైన రోజు.ఈ రోజున విఘ్నేశ్వరుడు ప్రత్యేక పూజలు అందుకుంటాడు.

మనం చేసే ఎటువంటి శుభకార్యమైనా ప్రారంభించే ముందు ఆ వినాయకుడికి పూజ చేసి ప్రారంభించడం వల్ల ఆ కార్యంలో ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతుంది.

వినాయకుడిని ప్రథమ పూజ్యుడు అని కూడా పిలుస్తారు.అంత ప్రత్యేకమైన బుధవారం రోజున వినాయకుడికి ఆవు నెయ్యి తో కలిపిన సింధూరాన్ని దిద్ది పూజ చేయడం ద్వారా మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.

అలాగే బుధవారం స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన గరిక, మోదకాలు సమర్పించాలి.వీటిని సమర్పించడం ద్వారా సంపద,సుఖసంతోషాలు చేకూరుతాయి.

ప్రతి బుధవారం ఐదు గరికలను స్వామివారికి సమర్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి,జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు.

బుధవారం గణేశునికి పూజ చేసిన అనంతరం స్వామివారికి నైవేద్యంగా లడ్డు, బెల్లంతో తయారుచేసిన స్వీట్లను, పెసరపప్పుతో చేసిన అట్లను, పాయసాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి.

అనంతరం గణేష్ గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా విఘ్నాలు తొలగిపోవడమే కాకుండా, బుధగ్రహ దోషాల నుంచి విముక్తి కలుగుతుంది.

అంతేకాకుండా మన జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది.అయితే స్వామికి సమర్పించిన నైవేద్యాన్ని ఆవుకు తినిపించడం ద్వారా శుభం కలుగుతుందనీ వేద పండితులు తెలియజేస్తున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయకుడిని కేతువు గా భావిస్తారు.అందువల్ల మనం చేసేటటువంటి పనులలో ఎటువంటి ఆటంకం లేకుండా ముందుగా వినాయకుడికి పూజలు చేస్తారు.

ఇంతటి మహిమగల వినాయకుడిని మన ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టడం ద్వారా మన ఇంట్లో ఏర్పడేటటువంటి ప్రతికూల వాతావరణాన్ని తొలగించి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అలాగే మన ఇంటి పై ఏర్పడే చెడు దృష్టి ని ఈ వినాయకుడు నాశనం చేస్తాడని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.

నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి నామినేషన్