ఈ రెండున్నరేళ్ల బాలుడు గూగుల్‌ తో ఎలా ఆడేసుకుంటున్నాడో చూడండి... మీ ఇంట్లో ఇలాంటివారు వున్నారా?

నేటితరం యెంత స్పీడుగా వున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల స్కిల్స్ ని చిన్నప్పుడే గుర్తించి వారికి ఇంట్లోనే గురువుల్లాగా మారి వారిని మరింత ప్రోత్సహిస్తున్నారు.

మరికొంతమంది దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు, అది అప్రస్తుతం.జ్ఞాపకశక్తి, తెలివి తేటల్లో కొందరు చిన్న పిల్లలు పెద్దలను మించిపోతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.

ఈ క్రమంలోనే సరిగ్గా మాటలు కూడా రాని వయసులో ఇంటర్‌నెట్ మాధ్యమం గూగల్‌ తరహాలో ప్రశ్న అడగగానే ఠక్కున సమాధానం చెబుతూ అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు ఓ బుడతడు.

ఈ పిల్లవాడ్ని అందరూ గూగుల్‌ బాయ్‌ అని పిలవడం కొసమెరుపు.ఈ పసివాడు పెద్దైతే అబ్దుల్‌ కలాం లాంటి ప్రతిభావంతుడు అవుతాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

అవును, కొందరు పుట్టుకతోనే ఎంతో జ్ఞానం, తెలివి తేటలతో పుడతారు.మరికొందరూ పుట్టిన తర్వాత అన్నీ నేర్చుకుంటారు.

హిమాచల్‌ప్రదేశ్‌కి చెందిన ఓ రెండున్న సంవత్సరాల బాబును చూస్తే మీకు అతడు ఓ ఏకసంతాగ్రాహిగా కనబడతాడు.

అవును, నోట్లోంచి మాటలు కూడా సరిగా రాని వయసులో దేశంలోని ఏ రాష్ట్రం పేరు చెప్పి రాజధాని చెప్పమంటే ఠక్కున చెప్పేస్తాడు మరి.

"""/"/ హిమాచల్‌ప్రదేశ్‌, షాడోల్‌ జిల్లాలోని కాంగ్రాలో నివసిస్తున్న దేవేష్‌ పుట్టుకతోనే మంచి షార్ప్.

ఏదైనా చూసినా , చదివినా, లేదంటే చెబుతుంటే విన్నా ఇట్టే గుర్తు పెట్టుకోవడం ఆ పిల్లవాడి మేధాశక్తికి నిదర్శనం.

పుస్తకంలో కనిపించే వాటిని వరుసగా చదువుకుంటూ వెళ్లే దేవేష్ గ్లోబు చూపించి అందులో ఇండియా మ్యాప్ చూపించమంటే ఇట్టే చూపిస్తాడు.

అలాగే ఇతర దేశాలు, రాష్ట్రాల పేర్లతో పాటు ఆయా రాష్ట్రాల సీఎంల పేర్లను తడబడకుండా చెప్పేస్తున్నాడు.

ఇలా ఒక్కటేమిటి, ప్రపంచంలోని దేశాల సంఖ్య, నెలల పేర్లు, రోజుల లెక్కింపుతో పాటుగా లెక్కలే కాదు పౌరాణిక, చారిత్రక అంశాలపై కూడా ఏదైనా ప్రశ్న వేస్తే సమాధానం చెబుతూ అందర్ని ఆశ్చర్యపరుస్తున్నాడు.

Chandra Mohan : చంద్రమోహన్‌కి వణుకు పుట్టించిన అలీ కూతురు..