ఆయన అప్పులు తీర్చేసి కోట్ల లాభాలు ఇచ్చిన ఎన్టీఆర్

సంతోషంలో ఎవరైనా మనతో ఉంటారు, కాని కష్టాల్లో మనతో ఉండేవారు బంధువులు, ఆత్మీయులు‌.

బంధాలు, బంధుత్వాలు కేవలం ఒకే కుటుంబంలో పుట్టగానే పేరుకే ఏర్పడినా, జీవితంలో ఒకరిపట్ల ఒకరం ఎలా ఉన్నాం అనే దాని మీద ఆ బంధానికి విలువ ఉంటుంది.

నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు.కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి, లాభాల బాట పడుతున్నారు.

అందుకు కారణం ఎన్టీఆర్.జైలవకుశ సినిమాకి ముందు కళ్యాణ్ రామ్ అప్పుల్లో ఉన్నారు.

ఓం సినిమా నుంచి మొదలైన అప్పులు, పటాస్ లాంటొ బ్లాక్ బస్టర్ తో కూడా తీరలేదు‌.

ఇక రవితేజ కిక్-2 చేసిన గాయం అలాంటిది ఇలాంటిది కాదు.పీకల్లోతు కష్టాల్లో పడిపోయారు‌.

అలాంటి సమయంలో అన్నని ఆదుకోవడానికి వచ్చాడు యంగ్ టైగర్.కళ్యాణ్ రామ్ కి జైలవకుశ ప్రాజెక్టు ని ఇచ్చాడు తారక్.

!--nextpage పెద్ద హీరోతో సినిమా అంటే వంద కోట్ల వ్యాపారం.బడ్జెట్ భారీగానే పెట్టాలి.

కాని క్లిక్ అయితే మంచి లాభాలుంటాయి.అదే జరిగింది.

ఈ సినిమాకి తారక్ రెమ్యునరేషన్ ఇప్పటివరకు తీసుకోలేదట.దాంతో జైలవకుశ బిజినెస్ ముగిసిన తరువాత కళ్యాణ్ రామ్ టేబుల్ మీద మిగిలిందో ఎంతో తెలిస్తే నోళ్ళు ఎండబెడతారు.

ఏకంగా 65-70 కోట్లు మిగిలాయట.జైలవకుశ సాటిలైట్ కలుపుకోని 112 కోట్ల బిజినెస్ చేసింది.

సినిమాని 50 కోట్ల లోపే పూర్తి చేసారట.తారక్ పైసా తీసుకోకపోవడం వలనే ఇది సాధ్యపడింది.

లాభాలు వస్తేనే నేను డబ్బు తీసుకుంటానని అన్నాడట ఎన్టీఆర్‌.ఇప్పుడు టేబుల్ మీద 65 కోట్లకు పైగా ఉన్నాయి కాబట్టి ఎన్టీఆర్ కి పారితోషికం ఇచ్చేసి, అప్పులన్ని తీర్చుకోవడం పెద్ద సమస్య కాదేమో‌.

మోకాళ్ల నొప్పులకు 20 నిమిషాల్లో చెక్.. ఫిట్‌నెస్ ట్రైనర్ సీక్రెట్ రొటీన్ లీక్!