ఏదో పాపమని ఫుడ్ పెడితే ఈ పక్షి ఎంత పని చేసిందో చూడండి..
TeluguStop.com
సాధారణంగా మూగ జీవులను చూస్తే కొందరికి బాగా జాలేస్తుంది.అందుకే వారు వీలైనప్పుడల్లా వాటికి ఆహారం అందిస్తుంటారు.
ఈ అలవాటు వల్ల వారు ఒక్కోసారి చిన్నపాటి చిక్కుల్లో కూడా పడుతుంటారు.తాజాగా ఒక యువతికి కూడా ఇదే పరిస్థితి ఎదురయింది.
"""/" /
వివరాల్లోకి వెళితే, ఆస్ట్రేలియాలోని( Australia ) ఓ మహిళ ఇటీవల ఒక కాకాటూ ( Cockatoo ) పక్షికి క్రాకర్ బిస్కెట్ తినిపించింది.
దాంతో ఆ పక్షి తమని పెంచి పోషించే దేవత దొరికినట్లు తెగ సబరపడిపోయింది.
అందుకే అది తన తోటి కాకాటూ పక్షులన్నీటిని సదరు యువతి వద్దకు తీసుకొచ్చింది.
వెంటనే ఆ కాకాటూల మంద ఆమె చుట్టూ గుమిగూడింది, అవి కూడా తమకు ఆహారం పెట్టాలంటూ కోరాయి.
"""/" /
వైరల్ వీడియో ప్రకారం, ఆ యువతి రెస్టారెంట్‌లో భోజనం చేస్తూ ఆనందిస్తుండగా బాల్కనీ రెయిలింగ్‌పై కాకాటూ కనిపించింది.
ఆమె తన క్రాకర్ బిస్కెట్ ముక్కను తుంచి పక్షికి అందించింది.కాకాటూ ఆహారం తీసుకుని ఎగిరిపోయింది.
కొన్ని సెకండ్ల తరువాత, ఆ యువతి తన టేబుల్ చుట్టూ కాకాటూల మంద గుమిగూడి ఉండటం చూసింది.
అవన్నీ ఆమె తమకు కూడా కొంత బిస్కెట్ ఇస్తుందేమోనని ఆశగా ఫుడ్ వైపే చూస్తూ ఉన్నాయి.
ఇది గమనించిన ఆ యువతి నవ్వుతూ కాకాటూలకు క్రాకర్స్ తినిపించడం ప్రారంభించింది.కాకాటూస్ ఫ్రెండ్లీ బర్డ్స్, అవి తరచుగా గ్రూప్స్‌గా ఉంటాయి.
ఆహారాన్ని షేర్ చేసుకుంటాయి.పక్షులకు ఆహారం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం అని యువతి యొక్క అనుభవం గుర్తుచేస్తుంది, ఎందుకంటే ఒక్కదానికి ఫుడ్ పెడితే తర్వాత పెద్ద గుంపుకు కూడా పెట్టాల్సి వస్తుంది.