వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల దీర్ఘాయుష్షు... ఎలా చేయాలంటే..

ఒక సరైన పద్ధతిలో వెయిట్ లిఫ్టింగ్ చేస్తే దీర్ఘాయుష్షు కలుగుతుందని చెబితే మీరు నమ్మగలరా.

వారంలో ఒక గంట పాటు వెయిట్ లిఫ్టింగ్ చేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది.

మన జీవితంలో యాక్టివ్ గా ఉండడం కోసం ఎక్సర్సైజ్ చేయడం సరైన పద్ధతిలో వాకింగ్ చేయడం యోగా చేస్తుండడం అలవాటు చేసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యానికి ఇవన్నీ చాలా మంచిదని వైద్యశాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇలా దీర్ఘాయుష్షు కలుగుతుందని ఎక్కువ బరువులు కూడా ఎత్తడం ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.

బ్రిటిష్ జనరల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ఈ స్టడీ వివరాలు లిఖించబడ్డాయి.

దీని ప్రకారం వెయిట్ లిఫ్టింగ్ చేస్తే త్వరగా మరణించే ప్రమాదం తగ్గుతుందని వెళ్లడైంది.

మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజ్‌లో కాస్త చెమట్లు పట్టడం, ఊపిరి తీసుకోవడం కొద్దిగా పెరగడం, హార్ట్ బీట్ కొంచెం పెరగడం లాంటివి జరుగుతాయి.

అదే హెవీ వెయిట్ లిఫ్టింగ్‌లో చెమట అధికంగా వస్తుంది.ఊపిరి వేగంగా తీసుకోవడం, హార్ట్ బీట్ అధికంగా ఉండడం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.

మేరీ ల్యాండ్ లోని రాక్ వీళ్లే లో ఉన్న నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుల బృందం అమెరికాలోని 10 క్యాన్సర్ సెంటర్లను పరిశీలించి దాదాపు ఒక లక్ష మంది ఆరోగ్య డేటాను సేకరించింది.

ఈ డేటా ప్రకారం 71 సంవత్సరములు వీరి వయసు ఉండగా BMI 27.

8 అంటే ఓవర్ వెయిట్ అని తేలింది. """/"/ దాదాపు పదేళ్లపాటు గుండె సంబంధిత వ్యాధులతో సహా మరణానికి కారణాలపై దృష్టి ఉంచారు.

వెయిట్ లిఫ్టింగ్ వల్ల మహిళలకు ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది.వారంలో కనీసం ఒకసారి లేదా రెండుసార్లు వెయిట్ లిఫ్టింగ్ చేసేవారిలో మరణించే ముప్పు 41-47 శాతం తగ్గిపోయిందట.

పురుషులతో పోలిస్తే మహిళల్లో వెయిట్ లిఫ్టింగ్ ప్రయోజనాలు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వెయిట్ లిఫ్టింగ్ చెయ్యడం వల్ల బ్లెడ్ ప్రెషర్, చెడు వ్యర్ధాలు బయటికి పోయి, ట్రైగ్లిసరాయిడ్స్ నియంత్రణలో ఉంటాయి.

అందుకే గుండె సంబంధిత వ్యాధుల ముప్పు కూడా తగ్గిపోతుంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : హాట్ హాట్‌ ట్రంప్ – బైడెన్ డిబేట్ .. ఇద్దరూ తగ్గట్లేదుగా ..!!