మళ్లీ మొదలైన లొల్లి ! వారికి ప్రాధాన్యంపై వీరి అలక
TeluguStop.com
తెలంగాణ కాంగ్రెస్ ( Telangana Congress )లో ఎప్పుడు ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంటుంది.
ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది.ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్ లో వచ్చి చేరుతూ ఉండడం , తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్న ధీమా పార్టీ నాయకులలోను వ్యక్తమవుతుండడం , కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం,, ఇవన్నీ ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.
ఇక బిజెపి బీఆర్ఎస్ పార్టీలలోని అసంతృప్త నేతలు అంతా కాంగ్రెస్ వైపే క్యూ కడుతూ ఉండడంతో, ఇటీవల కాలంలో చేరికలు భారీగా చోటుచేసుకున్నాయి.
అయితే టికెట్ల కేటాయింపు విషయంలో కొత్తగా చేరుతున్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుండడంతో సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తికి గురవుతూ తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు.
కొత్తగా వచ్చి చేరుతున్న నేతలు నియోజకవర్గాల్లోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు పార్టీకి రాజీనామాలు చేస్తూ ఉండడం ఇప్పుడు ఆ పార్టీలో కలకలం రేపుతోంది.
"""/" /
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న పాత నేతల్లో అసంతృప్తి తీవ్రంగా ఉంది.
బిజెపి, బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు పార్టీలో చేరబోతున్నారనే హడావుడి జరుగుతుండగా, పార్టీని వీడే వారి సంఖ్య అంతే స్థాయిలో ఉండడం కాంగ్రెస్ లో కలవరం పుట్టిస్తుంది.
ఆది, సోమవారాల్లో రెండు రోజుల్లోనే ఇద్దరు జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు కాంగ్రెస్ క రాజీనామా చేశారు తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ కోసం 1006 ముందు దరఖాస్తు చేశారు.
తమను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లు కేటాయించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుండడంతో కొన్ని జిల్లాల్లో పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారు అసంతృప్తికి గురవుతున్నారు .
మల్కాజ్ గిరి నియోజకవర్గం విషయానికొస్తే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు( Mainampalli Hanumanthrao ) కాంగ్రెస్ లో చేరారు.
దీంతో మెదక్, మేడ్చల్ డిసిసి అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేశారు మేడ్చల్ డిసిసి అధ్యక్షుడు నందికంటి శ్రీధర్( Nandikanti Sridhar ) మల్కాజ్ గిరి నియోజకవర్గంలో పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
"""/" /
మైనంపల్లి చేరిక తో అసంతృప్తికి పార్టీకి రాజీనామా చేశారు.ఇక మైనంపల్లి హనుమంతరావు ( Mainampalli Hanumanthrao )కుమారుడు రోహిత్ ( Mynampally Rohith )రావుకు మెదక్ అసెంబ్లీ టికెట్ ఇస్తారంటూ ఆయన వర్ధిల్లు చేస్తున్న ప్రచారంతో, మెదక్ డిసిసి అధ్యక్షుడు తిరుపతిరెడ్డి రెండు రోజుల క్రితం కాంగ్రెస్ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఇదేవిధంగా కొత్తగా వచ్చిన నేతలకు అసెంబ్లీ టికెట్లు కేటాయించబోతున్నారనే సంకేతాలతో ఆ సీట్ల పోసు ఆశలు పెట్టుకున్న సీనియర్ నేతలు అంతా పార్టీకి రాజీనామా చేస్తుండడం కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది.
మొదటిసారి ఆ రూమర్ పై స్పందించిన అనుష్క.. ఇక చాలు ఆపండంటూ?