బెజవాడ ఎంపీ సీటుపై టీడీపీ లో లొల్లి ! నాని సంచలన కామెంట్స్
TeluguStop.com
గత కొంతకాలంగా బెజవాడ టిడిపిలో సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని ( Kesineni Nani )అసమ్మతి వ్యవహారం హాట్ టాపిక్ గా ఉండేది.
పార్టీ లో చోటుచేసుకుంటున్న పరిణామాల పైన చంద్రబాబు పైన నాని సెటైర్లు వేసేవారు .
పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్టుగా వ్యవహరించడంతో పాటు, ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కొంతమంది కీలక టిడిపి నేతలు పైన బహిరంగంగా విమర్శలు చేసేవారు.
దీంతో నాని టిడిపిని వీడ బోతున్నారు అనే హదావాడి జరిగింది .
"""/" / దీనికి తగ్గట్లుగానే టిడిపి( TDP ) అధిష్టానం కూడా అక్కడ నానిని( Kesineni Nani ) పక్కన పెట్టి మరో వర్గాన్ని ప్రోత్సహిస్తూ వస్తుంది.
అయితే కొద్ది రోజులుగా సైలెంట్ గానే ఉంటూ వస్తున్న కేశినేని నాని మరోసారి స్వరం పెంచారు.
వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటును బీసీలకు ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చిన నేపథ్యంలో మరోసారి హాట్ కామెంట్స్ చేశారుముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడిన బుద్ధ వెంకన్న( Buddha Venkanna ) ను టార్గెట్ చేస్తూ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో బుద్ధ వెంకన్న విజయవాడ ఎంపి సీటు ఆశిస్తూ ఉండడం తో నాని వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
"""/" / '' విజయవాడ ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలన్న డిమాండ్ ను నేను ఆహ్వానిస్తున్నా .
కాల్ మనీ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించే వాళ్ళు బీసీలు కాదు .
నీతి , నిజాయితీ మచ్చలేని వ్యక్తులే అసలైన బీసీలు .కాల్ మనీ, సె * రాకెట్ , గూండా గిరి చేసేవాళ్లు బీసీల కిందకు రారు .
భూ కబ్జాలు చేసే వాళ్ళు , జనాలను హింసించిన వాళ్ళు బీసీలు కాదు.
పార్టీ కోసం కష్టపడిన నిఖార్సైన బీసీలు చాలామంది ఉన్నారు.అలాంటి వారికి టిక్కెట్లు ఇస్తే సంతోషిస్తా.
నిరుపేదలైనా కాళ్లకు దండం పెడతాం '' అంటూ నాని చేసిన కామెంట్స్ టిడిపిలో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి.
జుట్టు రాలడం తగ్గి దట్టంగా పెరగాలా.. అయితే ఈ ఆయిల్ మీకోసమే!