పీకేతో లోకేష్ భేటి .. ఏంటి సంగతి ?
TeluguStop.com
వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ( AP Assembly Elections )కచ్చితంగా టిడిపిని అధికారంలోకి తీసుకురావాలి అనే పట్టుదలతో ఉన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు.
అందుకే జనసేన పార్టీతోను పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో తమ గెలుపున కు డోకా లేకుండా చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిలో భాగంగానే రాజకీయ వ్యూహ కర్తగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్ సలహాలు ,సూచనలను ఎప్పటికప్పుడు బాబు తీసుకుంటున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ( YCP )అధికారంలోకి వచ్చే విధంగా ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలను అందించారు.
అయితే ఇప్పుడు టిడిపి కి ప్రశాంత్ కిషోర్ సలహాలు, వ్యూహాలను అందిస్తున్నారు.ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) తో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం ఏపీలో రాజకీయ సంచలనం సృష్టించింది.
"""/" /
ఇది ఇలా ఉంటే తాజాగా మరోసారి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) ప్రశాంత్ కిషోర్ తో ప్రత్యేకంగా భేటీ అయినట్టు సమాచారం.
హైదరాబాద్ లో ప్రశాంత్ కిషోర్ ( Prashant Kishore )ను కలిసిన లోకేష్ వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పాటించాల్సిన అనేక అంశాలపై చర్చించినట్లు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో వైసిపి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఏవిధంగా పై చేయి సాధించాలి ?ముఖ్యంగా మైనార్టీ వర్గాలను టిడిపికి అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవాలనే విషయం పైన చర్చించినట్లు సమాచారం.
అలాగే వైసిపి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలని విషయాల పైన పీకే నుంచి సలహాలు తీసుకున్నారట.
"""/" /
వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన ( TDP, Jana Sena )కూటమి బలోపేతం అయ్యేవిధంగా ఎటువంటి వ్యూహాలను అమలు చేయాలి ? ఏ విధంగా వైసీపీ పై చేయి సాధించాలనే విషయం పైన చర్చించినట్లు సమాచారం.
ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాలను అమలు చేసి, వచ్చే ఎన్నికల్లో తమకు ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు టిడిపి ప్రయత్నిస్తోంది.
అలాగే ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో తమ కోసం మరింత సమయాన్ని కేటాయించాల్సిందిగా లోకేష్ ప్రశాంత్ కిషోర్ ను కోరారట.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి30, గురువారం 2025