లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

టీడీపీ నేత నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.

ఈ మేరకు ఏపీ హైకోర్టు విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది.

అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈనెల 12వ తేదీ వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.కాగా గత విచారణలో లోకేశ్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ పిటిషన్ పై విచారణ జరగగా ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మరోసారి వాయిదా వేసింది.