ఈనెల 29 నుంచి మళ్లీ లోకేష్ యువగళం పాదయాత్ర..!!

టీడీపీ యువనేత నారా లోకేష్( Nara Lokesh ) యువగళం పాదయాత్ర సెప్టెంబర్ 29వ తారీకు నుంచి మళ్లీ మొదలు కాబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేయడం జరిగింది.

ఈనెల 29 రాత్రి 8:15 నిమిషాలకు తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి లోకేష్ పాదయాత్ర చేపట్టనున్నారు.

కొన్ని వారాల క్రితం చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో సెప్టెంబర్ 9వ తారీకు పాదయాత్ర ఆపేయడం జరిగింది.

ఆ తరువాత లోకేష్ చంద్రబాబుకి( Chandrababu Naidu ) బెయిల్ మరియు ఇంకా అనేక విషయాలకు సంబంధించి ఢిల్లీలో పర్యటిస్తూ ఉన్నారు.

కాగా ఇప్పుడు మళ్ళీ 20 రోజుల తర్వాత "యువగళం" పాదయాత్ర ప్రారంభించబోతున్నారు.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం పోస్ట్ పెట్టడం జరిగింది.

"అద్భుత ప్రజాదరణతో జైత్రయాత్రలా కొనసాగుతోన్న యువగళం పాదయాత్ర( Yuvagalam Padayatra ) చంద్రబాబు గారి అక్రమ అరెస్టు కారణంగా ఆగింది.

కానీ అది చిన్న విరామం మాత్రమే.ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే మళ్ళీ సెప్టెంబర్ 29, 2023, రాత్రి 8.

15 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తున్నారు నారా లోకేష్ గారు." అని ప్రకటించారు.

యువగళం మళ్లీ ప్రారంభం కాబోతుందని పార్టీ ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొనటానికి ఫుల్ జోష్ మీద ఉన్నారు.

లోకేష్ పాదయాత్రలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ పెళ్లిపై గుడ్ న్యూస్ చెప్పిన చరణ్…. అమ్మాయి వివరాలు లీక్!