అలా చేస్తానన్న లోకేష్.. వద్దంటున్న చంద్రబాబు.. కార‌ణం ఏంటి..?

ఏపీ ఎన్నికల్లో 2024 ఫీవర్ అప్పుడే మొదలయిపోయింది.పొత్తుల విషయం కొలిక్కి రాక ముందే నేతలు ఇప్పటి నుంచే 2024 పోల్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

టీడీపీ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది.ఎలాగైనా సరే 2024లో గెలిచి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోంది.

అలా ఉండగా.చంద్రబాబును అసెంబ్లీలో అవమానించారని, తన భార్యను కూడా నానా మాటలన్నారని ఆయన చెబుతూ మీడియా ముందే చిన్న పిల్లాడిలా ఏడ్చేశారు.

తాను సీఎం అయితే తప్ప అసెంబ్లీకి రానని శపథం చేసి వచ్చారు.దాంతో గెలుపు మీద కాన్సంట్రేట్ బాగా పెరిగింది.

ఎలాగైనా సరే గెలిచి సత్తా చాటాలని తమ్ముళ్లు భావిస్తున్నారు.ఇక టీడీపీలో లోకేష్ కు సెకండ్ పొజిషన్ ఉండేది.

లోకేష్ ను చంద్రబాబు తర్వాత పార్టీ హెడ్ గా చూసేవారు.లోకేష్ కూడా అలానే వ్యవహరించుకుంటూ పోతున్నారు.

కానీ ఈ సారి మాత్రం లోకేష్ ఫోకస్ పార్టీ మీద పెట్టొద్దని బాబు చెప్పారట.

అంతే కాకుండా చిన బాబు రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేస్తానని చెబితే కూడా బాబు వద్దన్నారని టాక్ నడుస్తోంది.

అసలు ఇంతకీ ఏం జరిగిందంటే. """/"/ చంద్రబాబు తనయుడు లోకేష్ నిన్న మొన్నటి దాకా వైసీపీ మీద వైసీపీ ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేస్తూ వచ్చారు.

కానీ ఇప్పుడు ఆయన ఒక్కసారిగా సైలెంట్ గా మారిపోయారు.ఆయన సైలెంట్ గా మారడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని అంతా అనుకుంటున్నారట.

ఇంతకీ లోకేష్ అలా సైలెంట్ కావడానికి కూడా బాబే కారణమని అంతా విశ్వసిస్తున్నారు.

అంతే కాకుండా లోకేష్ రాష్ట్రం మొత్తం సైకిల్ మీద యాత్ర చేస్తానని చెప్పినా కూడా చంద్రబాబు వద్దని వారించినట్లు సమాచారం.

దీంతో లోకేష్ తన నిర్ణయాన్ని విరమించుకోక తప్పలేదని చాలా మంది చర్చించుకుంటున్నారు.

రాజీనామా లేఖను తీసుకొని వస్తారా.? సీఎం రేవంత్ కు హరీశ్ రావు మరో సవాల్..!!