లోకేష్ ని కూడా అరెస్టు చేస్తాం అంటున్న పేర్ని నాని..!!

వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని( Perni Nani ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పాత్ర పై ఆధారాలు సేకరిస్తున్నట్లు స్పష్టం చేశారు.

చెట్టు తొర్రలో దాక్కున్న లోకేష్ నీ అరెస్టు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

చంద్రబాబు కంటే లోకేష్ గొప్పవాడు ఏం కాదని పేర్కొన్నారు.లోకేష్ హెరిటేజ్ సంస్థకు డైరెక్టర్ గా ఉన్నప్పుడే అమరావతి( Amaravati )లో భూములు కొనాలని నిర్ణయించారని పేర్ని నాని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధాని అంశంపై రోజుకో డ్రామాలాడారు.తెలుగుదేశం పార్టీ హయాంలో అవినీతి కథల్లో ఇది కూడా ఒక భాగం.

దోపిడి దొంగలు రెక్కీ వేసినట్లుగా రింగ్ రోడ్డు కుంభకోణం జరిగిందని పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం లోకేష్ ఢిల్లీలో ఉన్నారు.చంద్రబాబుకి బెయిల్ తీసుకురావడానికి పెద్ద పెద్ద లాయర్లతో మంతనాలు జరుపుతున్నారు.

పరిస్థితి ఇలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిఐడి నారా లోకేష్ నీ A14 నిందితుడిగా చేర్చడం జరిగింది.

ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా చంద్రబాబు పేరు చేర్చారు.ఈ క్రమంలో లోకేష్( Nara Lokesh ) నీ కూడా త్వరలో అరెస్టు చేస్తారంటూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కామెంట్లు చేయడం.

సంచలనంగా మారింది.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!