యువగళం లోకేష్ పాసైనట్టేనా?

తెలుగు రాష్ట్రాల్లో లోని రాజకీయ నాయకుల్లో అత్యంత ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్న రాజకీయ నాయకుడు నారా లోకేష్( Nara Lokesh ) నేమో .

అతని శరీర నిర్మాణం దగ్గర నుంచి అతని తెలివితేటలని, అతని భాషను సైతం ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తుండేవి .

కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి నేతలు అయితే అతన్ని రాయడానికి కూడా వీలు లేని భాష ఉపయోగించి తిడుతుండేవారు.

మిగతా ఏ నేత మీద లేననన్ని మీమ్స్ కూడా లోకేష్ మీద సోషల్ మీడియా లో చలామణి అయ్యాయి .

ప్రారంభంలో లోకేష్ కూడా భాష విషయంలో తడబడుతూ ఉండడంతో సామాన్య జనంలో కూడా లోకేష్ నాయకత్వ ప్రతిభ మీద అప నమ్మకం ఉండేది.

అతను ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు కాదని బలవంతంగా రుద్దపడ్డ నాయకుడు అంటూ ప్రతిపక్షాలు చేసే విమర్శలను గట్టిగా తిప్పి కొట్టలేని పరిస్థితుల్లో టిడిపి శ్రేణులు ఉండేవి .

అతను పాదయాత్ర పూర్తిస్థాయిలో చేయలేడని కూడా అంచనాలు వచ్చాయి.ఆయన ప్రసంగాలు కూడాఅంతా జనరంజికంగా ఉండేవి కాదు .

అయితే ఈ అడ్డంకులు అన్నీ దాటుకుని ఆయన మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా లోకేష్ ఆయన పై ఉన్న విమర్శలను తిప్పికొట్టడంలోపాస్ అయ్యాడా అని చూస్తే అవుననే సమాధానం వస్తుంది.

"""/" / చాలా రోజుల కిందటే ఫిట్నెస్ పరంగా తనను తాను దిద్దుకున్న లోకేష్ .

రాజకీయ అంశాల మీద అవగాహన పెంచుకోవడంలోనూ, ద్వితీయ శ్రేణి నాయకులను కలుపుకొని పోవడంలోనూ, ప్రతిపక్షాల సూటిగా విమర్శించడంలోనూ రాటుదెలారనే చెప్పాలి.

కార్యకర్తలతోను నాయకులతోను సమన్వయం చేసుకుంటూ యువగళం( Yuvagalam ) పాదయాత్రను అతను ముందుకు తీసుకు వెళ్తున్న విధానం అతను పరిణితి చెందిన నాయకుడిగా రూపాంతరం చెందుతున్నాడనే చెప్పాలి.

ఎక్కడెక్కడ పోలీసులు అడ్డంకులు కలిగిస్తున్నా కూడా వెను తిరగకుండా ధైర్యంగా నిలబడి ప్రభుత్వ విధానాలపై నిలదీస్తున్న తీరు అతనిలోని దైర్యనికి, నాయకత్వ పటిమ కు అర్థం పడుతుంది.

"""/" / ఎక్కడికక్కడ సందర్భానికి తగినట్లుగా అక్కడ సమస్యలను స్పర్శించడం, వాటిక తొందర్లోనే పరిష్కారం చూపిస్తానంటూ హామీ ఇవ్వడం ప్రజల ను ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా యువతను ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తున్న లోకేష్ టిడిపి( TDP ) వైపు యువతని తీసుకొచ్చే ప్రయత్నం సీరియస్ గానే చేస్తున్నారు అని చెప్పాలి ఇకపై ఎవరూ కూడా లోకేష్ ని తండ్రి చాటు బిడ్డగా పరిగణలోకి తీసుకోరు అతని విమర్శించాలంటే ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాడు.

ఇది చంద్రబాబు గర్వపడాల్సిన విషయం .

నా ఒంటి రంగును చూసి నేనెప్పుడూ గర్వపడతాను : అర్చన