అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రే సీరియస్ అయ్యారు లోకేష్ సంచలన కామెంట్స్..!!

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ముందే వాతావరణ శాఖ హెచ్చరించింది.

అయినా గాని సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో నిద్రపోతూ.నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఈ విషయమే.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు.రాష్ట్రంలో వరదలు వల్ల ప్రజలు రైతులు నష్టపోవడానికి కారణం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, అదే రీతిలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకు పోయింది అని.

సాక్షాత్తు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి.గజేంద్ర సింగ్ షెకావత్.

రాజ్యసభలో ప్రకటించారని స్పష్టం చేశారు.రాష్ట్రంలో వరదల వల్ల 39 మంది మరణించారు ఆ మరణాలకు కారణం సీఎం జగన్ అని తెలిపారు.

రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు గాను దాదాపు 8 గ్రామాలు పాక్షికంగానూ, 4 గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

రూ.1,721 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని ఇవన్నీ ముమ్మాటీకి ప్రభుత్వ హత్యలేనని నారా లోకేష్ ఆరోపించారు.

సొంత జిల్లాలో ప్రాణ నష్టం జరిగితే.నవ్వుతూ సెల్ఫీ దిగుతూ ఉండటం దారుణమని ఇదే క్రమంలో ప్రజా సమస్యల విషయంలో ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీపై నిందలు వేశారని పైశాచిక ఆనందం పొందుతున్నారు అంటూ జగన్ పైన లోకేష్ విమర్శల వర్షం కురిపించారు.

కనీసం ఇప్పటినుండి అయినా విపత్తుల విషయంలో వైసీపీ ప్రభుత్వం మొద్దునిద్ర వీడి.అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కొడుకు పుట్టడంతో ఆ అలవాటు మార్చుకున్నా… హీరో నిఖిల్ కామెంట్స్ వైరల్