షాకింగ్ నిర్ణయం తీసుకున్న లోకేష్.. భీమిలిలో కూడా పోటీకి రెడీ అవుతున్నాడా?
TeluguStop.com
వచ్చే ఎన్నికల కోసం నారా లోకేష్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడా? అంటే అవుననే మాట వినిపిస్తుంది.
టీడీపీ అగ్ర నాయకుడు యువనేత లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారని అనుకున్నారంతా.
గతంలో లోకేష్ కూడా ఇదే మాట చెప్పారు.మంగళగిరి నుంచే పోటీ చేస్తానని అక్కడ గెలిచి తన తండ్రి చంద్రబాబు నాయుడికి కానుకగా ఇస్తానని లోకేష్ ప్రకటించాడు.
ఈయన గత ఎన్నికల్లో మంగళగిరి స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు.అందుకే మళ్ళీ ఇక్కడే పోటీ చేసి గెలిచి తీరాలని.
లోకేష్ గట్టి పట్టుదలతో ఉన్నాడు.అయితే ఇప్పుడు లోకేష్ మరొక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
కొంత మంది టీడీపీ నేతలు లోకేష్ ను భీమిలి లో కూడా పోటీ చేయమని కోరుతుండడంతో ఇప్పుడు లోకేష్ నిర్ణయం మారిందట.
భీమిలి స్థానంలో గతంలో సబ్బంహరి పోటీ చేసి ఓడిపోయారు.అయితే ఈ మధ్యనే ఈయన చనిపోవడంతో ఈ స్థానంలో ప్రెజెంట్ గట్టి లీడర్ ఎవరు లేకపోవడంతో లోకేష్ ను పోటీ చేయమని అడుగుతున్నారు.
, గతంలోనే ఇక్కడ లోకేష్ పోటీ చేయాల్సి ఉండగా ఈయన మంగళగిరి ఎంచుకుని ఇక్కడ పోటీ చేసాడు.
"""/"/
అయితే ఇప్పుడు భీమిలి లో పోటీ చేయాల్సిందే అని ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు.
ఇటీవలే మంగళగిరిలో గట్టి బలమైన నేతగా పేరు తెచ్చుకున్న గంజి చిరంజీవి రాజీనామా చేయడంతో టీడీపీ కి దెబ్బ పడింది.
ఈయన వైసీపీ లో చేరిపోవడంతో టిడిపి ఆలోచనలో పడింది.వైసీపీ గంజి చిరంజీవిని ఇక్కడ నుంచి పోటీ చేపిస్తుందని తెలుస్తుంది.
అలాగే ఇంకా గట్టి నేతలు ఇక్కడ పోటీకి దిగుతున్నారు.దీంతో లోకేష్ నిర్ణయం మార్చుకున్నారా? అనే చర్చ ఇప్పుడు సాగుతుంది.
ఇదే జరిగి గట్టి పోటీ ఎదురైతే మాత్రం లోకేష్ నెక్స్ట్ అప్షన్ భీమిలి నే అవుతుంది అని భీమిలి లో టీడీపీ కి బాగానే సపోర్ట్ ఉండడంతో ఇక్కడ కూడా పోటీ చేస్తే బాగుటుంది అని అనుకుంటున్నారట.
చూడాలి మరి లోకేష్ నిర్ణయం ఏంటో.
మా అమ్మ గురించి మీకేం తెలుసు.. పవిత్ర గౌడ కూతురు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!