లోకేష్ నాయకత్వం.. టెస్టింగ్ టైమ్ ?

ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే.అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జైల్లో ఉన్నారు ఆయన ఎప్పుడు బయటకు వస్తారో కూడా క్లారిటీ లేని డైలమాలో ఉన్నారు టీడీపీ శ్రేణులు.

ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్( Nara Lokesh ) పార్టీని నడిపించే బాద్యతను భుజాన వేసుకొని తనదైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు.

అయితే లోకేష్ పై కూడా వివిధ స్కామ్ లు చుట్టూ ముడుతుండడంతో ఆయనకూడా జైలుకు వెళ్తారా అనే సందేహాలు టీడీపీ శ్రేణులను వేధిస్తున్నాయి.

అటు జనసేనతో పొత్తు కన్ఫర్మ్ అవ్వడంతో అసలు తదుపరి ఎలాంటి వ్యూహరచనతో ముందుకు సాగాలనేది టీడీపీకి అంతు చిక్కడంలేదు.

ఇంతటి సందిగ్ధ పరిస్థితుల్లో నారా లోకేష్ చంద్రబాబుతో రేపు మూలాఖత్ కానున్నారు. """/" / దీంతో నారా లోకేష్ కు చంద్రబాబు( Chandrababu Naidu )కు ఇచ్చే సూచనలెంటి అనే దానిపై రాజకీయ వర్గల్లో చర్చ జరుగుతోంది.

గతంతో పోల్చితే నారా లోకేష్ రాజకీయంగా బాగానే పరిణితి చెందాడని పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు.

చంద్రబాబు తరువాత పార్టీని నిబద్దతతో ముందుకు నడిపించగలడనే నమ్మకం లోకేష్ విషయంలో రోజు రోజుకు పెరుగుతోంది.

దాంతో ఈ టైమ్ లో లోకేష్ కు కీలక సూచనలు అవసరం.ఈసారి జరిగే మూలఖత్ లో జనసేన విషయంలో టీడీపీ ఎలా వ్యవహరిచాలనే దానిపై లోకేష్ కు చంద్రబాబు సూచించే అవకాశం ఉంది.

"""/" / అలాగే సీట్ల కేటాయింపులో కూడా ఎక్కడ తొందరపాటు వ్యాఖ్యలు చేయరాదని, సందర్భానుసారం అనుసరించేలా లోకేష్ ను బాబు డైరెక్షన్ చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం టీడీపీ( TDP )లో చంద్రబాబు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుండడంతో లోకేష్ హైలెట్ కావాలంటే ఇదే మంచి సమయం.

ఒకవేళ బాబు బయటకు వచ్చిన ఇకపై పార్టీకి సంబంధించిన అన్నీ కార్యక్రమాలు వ్యూహాలు లోకేష్ ద్వారానే అమలు చేసేలా చంద్రబాబు ప్లాన్ చేసే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మొత్తానికి అధినేత జైలుకు వెళ్ళడం రాజకీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న లోకేష్ పార్టీ బాద్యతలను భుజాన వేసుకువడం వంటి పరినమలన్నీ లోకేష్ రాజకీయ పరిణితికి టెస్టింగ్ టైమ్ అంటూ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

రాజీనామా చేయించే ఆలోచనలో కాంగ్రెస్ .. ‘ దానం ‘ ఒప్పుకుంటారా ?