‘తలైవర్171’ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.. రజినీకాంత్ తో లోకేష్!

సూపర్ స్టార్ రజనీ కాంత్( Rajinikanth ) గురించి ఇండియన్ వైడ్ గా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు.

70 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికి ఈయన వరుస సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు.

ఇటీవలే రజనీకాంత్ నటించిన ''జైలర్( Jailer )'' సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అందుకుంది.

ఇది నిర్మాతల జేబులను నింపింది.ఈ రేంజ్ లో హిట్ సాధిస్తుంది అని ఎవ్వరూ అనుకోలేదు.

"""/" / కొన్నేళ్లుగా ఫామ్ కోల్పియిన సూపర్ స్టార్ కు ఆయన రేంజ్ హిట్ దక్కింది.

నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా 650 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి సంచలనం క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో ఇప్పుడు నెక్స్ట్ తలైవర్ తన 171వ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.

ఈ రోజు దీనిపై అధికారిక ప్రకటన సైతం వచ్చేసింది.ఎప్పటి నుండో లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడు అని రూమర్స్ రాగా ఇప్పుడు దానిని నిజం చేస్తూ ఈ రోజు అఫిషియల్ ప్రకటన వచ్చేసింది.

సూపర్ స్టార్ తలైవర్ 171 వ సినిమాను లోకేష్ డైరెక్ట్ చేయబోతున్నాడు అని అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించనున్నట్టు తెలిపారు.

ఇక సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. """/" / అలాగే ఈ సినిమాకు యాక్షన్ డైరెక్టర్లు గా అన్బు అరివ్ వ్యవహరించనున్నారని తెలిపారు.

ప్రకటనతో అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.ప్రజెంట్ లోకేష్ విజయ్ దళపతితో చేస్తున్న లియో దసరా కానుకగా రిలీజ్ కానుంది.

మరి ఇది రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.