ప్రభాస్ సినిమానే ఆ డైరెక్టర్ కి ఆఖరి సినిమా కానుందా… ఇండస్ట్రీకి దూరం కానున్నారా?

ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నటువంటి వారిలో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ( Lokesh Kanagaraj ) కూడా ఒకరు.

ఈయన విక్రమ్ మాస్టర్ ఖైదీ వంటి వరస బ్లాక్ బాస్టర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ప్రస్తుతం హీరో విజయ్( Vijay ) నటించిన లియో( Leo )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన తన తదుపరి సినిమాల గురించి పలు విషయాలను వెల్లడించారు.

"""/" / ఈ సందర్భంగా లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ తాను అసలు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రాలేదని తెలిపారు.

ఇక పది సినిమాలు తర్వాత తాను పూర్తిగా ఇండస్ట్రీకి దూరమవుతానని ఈయన తెలియజేశారు.

అయితే ప్రభాస్ తో సినిమా ఉంటుందనే విషయం గురించి కూడా ఈయన ఈ సందర్భంగా మాట్లాడారు.

ప్రభాస్ గారితో తన సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రభాస్ ( Prabhas ) కి ఒక కథ కూడా చెప్పానని అయితే మా కాంబినేషన్లో సినిమా రావడానికి కొంత సమయం పడుతుందని తెలియజేశారు.

"""/" / ఇక లోకేష్ ప్రభాస్ కాంబినేషన్లో ఏ తరహా సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుందనే విషయం గురించి కూడా ఈయన తెలియజేశారు.

ఒక యాక్సిడెంట్ లో చెయ్యి పోగుట్టుకున్న హీరో.ఐరన్ హ్యాండ్ అమర్చుకొని క్రైమ్స్ సిండికెట్ లో ఏం చేశాడనేది సినిమా కథ అని పేర్కొన్నాడు.

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్ సినిమా ఏండ్ గేమ్ చిత్రం కాబోతుందని తెలుస్తుంది.

ఈయన ప్రభాస్ తో చేసే సినిమానే తన ఆఖరి సినిమా అని అనంతరం ఈయన ఇండస్ట్రీకి దూరం కాబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

ఏది ఏమైనా ఇలాంటి ఒక సూపర్ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి దూరం కావడం అనేది నిజంగా అభిమానులు జీర్ణించుకోలేని విషయం అయితే అప్పటికి ఈయన మనసు మారితే బాగుంటుందని అభిమానులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మూడు చోట్ల ఫ్యాక్చర్ అయింది… మీ ప్రేమకు రుణపడి ఉంటా: రష్మిక