తెలుగు హీరోలకు ఈసారి కూడా చిక్కని లోకేష్ కనగరాజ్
TeluguStop.com
కత్తి సినిమా తో పాన్ ఇండియా స్థాయి లో గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj ).
తెలుగు లో ఆయన ఒక సినిమా చేయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.కానీ ఇప్పట్లో అది సాధ్యం అయ్యేలా లేదు.
ఖైదీ తర్వాత వెంటనే మాస్టర్ సినిమాను చేశాడు.కమల్ హాసన్ హీరోగా విక్రమ్ సినిమా ను చేసిన లోకేష్ కనగరాజ్ భారీ విజయాలను ముందు ముందు మరిన్ని అందుకుంటాడని చాలా మంది అంటున్నారు.
అందుకే ఆయన దర్శకత్వం లో నటించేందుకు గాను తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. """/" / బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోలు మొదలుకుని టాలీవుడ్ హీరోలు ఎంతో మంది ఆయన దర్శకత్వం లో సినిమాకు ఓకే చెప్పేందుకు రెడీగా ఉన్నారు.
కానీ ఇప్పటి వరకు ఆయన తమిళం కాకుండా ఇతర సినిమా ల్లో నటించేందుకు నో చెప్పాడు.
ప్రస్తుతం లియో సినిమా( Leo ) ను చేస్తున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరో వైపు రజినీకాంత్ సినిమాకు కమిట్ అయ్యాడు.
లియో సినిమా తర్వాత తెలుగు సినిమా ను చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ అంతా ప్రచారం జరిగింది.
కానీ లోకేష్ కనగరాజ్ మాత్రం మళ్లీ రజినీకాంత్ సినిమా తోనే తమిళ సినీ ఇండస్ట్రీ లో ఉండాలని భావిస్తున్నాడు.
"""/" /
టాలీవుడ్( Tollywod ) కి చెందిన హీరోలు ఎంతగా ప్రయత్నించినా కూడా లోకేష్ కనగరాజ్ మాత్రం కోలీవుడ్ లో మాత్రమే సినిమా చేసేందుకు రెడీ అవ్వడం తో టాలీవుడ్ హీరోలు ఉసూరుమంటున్నారు.
ఇప్పటి వరకు టాలీవుడ్ లో లోకేష్ కనగరాజ్ సినిమా ను చేసేందుకు కనీసం ఓకే కూడా చెప్పలేదు.
టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలు కనీసం ఒక్క సినిమా అయినా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం లో చేయాలని భావిస్తున్నారు.
కానీ లోకేష్ మాత్రం ఆ దిశగా ఆలోచిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.ముందు ముందు అయినా టాలీవుడ్ హీరోలతో లోకేష్ కనగరాజ్ సినిమా లు చేసే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి.