పవన్ వాడిన పదాన్ని పదే పదే వాడుతున్న లోకేశ్.. అదేంటంటే?

సినీనటుడు పవన్ కల్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత పాలిటిక్స్‌లో ఉంటూనే సినిమాల వైపు మొగ్గు చూపారు.

ప్రస్తుతం ఆయన పాలిటిక్స్, సినిమాలు రెండూ చేస్తున్నారు.కాగా, సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ అయిన పవన్ రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్ కాలేకపోయారనే విమర్శలు ఉన్నాయి.

కాగా, పవన్ ఉపయోగించిన ఓ పదాన్ని టీడీపీ నేత నారా లోకేశ్ పదే పదే వాడుతున్నారు.

అదేంటంటే.వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి సీఎం అయిన మొదట్లో ఆయన గురించి మాట్లాడుతూ పవన్ ‘జగన్ రెడ్డీ’ అని సంబోధించారు.

అలా పలకడం వెనక రాజకీయం ఉందనే చర్చ ఉండగా, ఆ తర్వాత కాలంలో పవన్ ముఖ్యమంత్రి జగన్ గురించి అంతగా మాట్లాడలేదు.

సినిమాల్లోనే ఫుల్ బిజీ అయిపోయారు.అయితే, టీడీపీ మాత్రం ఆ పదాన్ని యూజ్ చేసేందుకు ముందుకొచ్చింది.

టీడీపీ భావినేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రతీ రోజు ట్విట్టర్ వేదికగా ‘జగన్ రెడ్డీ’ అంటూ పలు సమస్యలపై విన్నవిస్తుంటారు.

ఇకపోతే జూం మీటింగ్స్‌లో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం ‘ఏం జగన్ రెడ్డి’ అంటూ మాట్లాడటం మనం చూడొచ్చు.

అయితే, నారా లోకేశ్ మాటలకు వైసీపీ శ్రేణులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ స్పందించలేదు.

ఈ క్రమంలోనే పవన్ మొదలెట్టిన దీర్ఘాలను లోకేశ్ తీసి తీసి అలసిపోతున్నారే తప్ప ప్రయోజనం ఏం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది.

అయితే, గతంతో పోల్చితే నారా లోకేశ్ ప్రజా సమస్యలపైన యాక్టివ్‌గా మాట్లాడుతున్నారని, ప్రతీ క్షణం పార్టీ కోసం పని చేస్తున్నారని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.

ఇకపోతే లోకేశ్ ‘జగన్ రెడ్డీ’ అని వైసీపీ అధినేతపై మాట్లాడుతుంటే.వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లోకేశ్‌కు ‘మా లోకం’అని పేరు పెట్టారు.

లోకేశ్‌పైన విజయసాయిరెడ్డి విమర్శల వర్షం ట్విట్టర్ వేదికగా కురిపిస్తూనే ఉండటం మనం పరిశీలించొచ్చు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్న ప్రశాంత్ నీల్?