అచ్చెన్న  కు ఎర్త్ పెడుతున్నారా ? లోకేష్ ప్రమోషన్ 'సక్సెస్ ' ? 

టిడిపి ఏపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కింజరాపు ఉన్నారు.జగన్ వంటి బలమైన, ధృడమైన వ్యక్తిని తట్టుకుంటూ పార్టీని జనాల్లోకి తీసుకువెళుతూ,  రాబోయే ఎన్నికలలో టిడిపికి అధికారం చేయాలంటే చంద్రబాబు ఒక్కడి వల్ల సాధ్యం కాదు.

అందుకే మంచి వాక్చాతుర్యం, జగన్ పై నేరుగా విమర్శలు చేస్తూ , టిడిపి తరఫున బలమైన వాయిస్ వినిపించే అచ్చెన్నాయుడు కు ఏపీ టీడీపీ బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు.

ఈ ప్రతిపాదనకు మొదట్లో టిడిపి యువ నాయకుడు నారా లోకేష్ అడ్డం పడినా, చంద్రబాబు మాత్రం అచ్చెన్న వైపు మొగ్గు చూపించారు.

బాబు చూపించిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, అచ్చెన్న తనదైన శైలిలో పార్టీని మరింత ముందుకు తీసుకువెళుతూ,  అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ , జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ వచ్చారు.

అయితే ఇటీవల జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా, ఓ హోటల్ లో ప్రైవేట్ సంభాషణల్లో పార్టీ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు అచ్చెన్న.

,/br """/"/ అలాగే లోకేష్ పైనా అచ్చెన్న విమర్శలు చేసిన వీడియో బయటకు రావడం తీవ్ర దుమారాన్ని రేపింది.

ఐతే ఆ వీడియో మార్ఫింగ్ చేసింది అంటూ అచ్చెన్న చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

టిడిపిలో ఇప్పుడు ఆయన సైలెంట్ గా ఉంటున్నారు.పెద్దగా యాక్టివ్ గా ఉండలేకపోతున్నారు.

మొత్తం లోకేష్ పైనే టీడీపీ రాజకీయం నడుస్తోంది.వివిధ ప్రజా సమస్యలపై లోకేష్ స్పందిస్తున్నారు.

ఇటీవల పదో తరగతి ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలంటూ లోకేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.

అయినా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కోర్టుకు వెళ్లడం,  చివరకు కోర్టు సూచనలతో ఆ విషయంలో వెనక్కి తగ్గి పది, ఇంటర్ పరీక్షలను జగన్ వాయిదా వేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

 ఇదంతా లోకేష్ క్రెడిట్ అని, ఆయన పోరాటం చేయబట్టే ఇదంతా సాధ్యమైందని, లోకేష్ టీమ్ బాగా ప్రమోట్ చేసుకుంది.

అయితే ఇదంతా టిడిపిలో లోకేష్ హవా పెంచడంతోపాటు,  అచ్చెన్న ప్రభావం టిడిపిలో ఇకపై ఉండబోదనే సంకేతాలను ఇప్పటి నుంచే ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

పొమ్మనకుండా పొగ పెట్టాలి అనే విధంగా అచ్చెన్న విషయంలో లోకేష్ టీమ్ పనిచేస్తుంది అనే గుసగుసలు ఇప్పుడు టీడీపీ నుంచే వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీకి ఆ టైటిల్ ను ఫిక్స్ చేయడం కష్టమే.. ఆ కష్టాన్ని అధిగమిస్తారా?