జగన్ గురించి మాట్లాడే అర్హత లోకేశ్‎కు లేదు..: మంత్రి జోగి రమేశ్

ఏపీ సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేత నారా లోకేశ్ కు లేదని మంత్రి జోగి రమేశ్ అన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు లోకేశ్ కు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను లాక్కొని నలుగురిని మంత్రులు చేసినప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా అని మంత్రి జోగి రమేశ్ నిలదీశారు.

అలాగే చంద్రబాబు నిజాయితీ పరుడైతే రెగ్యులర్ బెయిల్ ఎందుకు రాలేదో చెప్పాలన్నారు.ఇప్పటివరకు కోట్లు ఖర్చు చేశారన్న మంత్రి జోగి రమేశ్ బెయిల్ వచ్చిందా అని ప్రశ్నించారు.

స్కిల్ స్కాం బయటపెట్టింది కేంద్ర దర్యాప్తు సంస్థలని వెల్లడించారు.స్కిల్ స్కాం కేసులో ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీస్ ఇచ్చిందా? లేదా? అని అడిగారు.

ఈడీ, ఐటీ ఎవరి పరిధిలో ఉన్నాయో తెలియదా అని మండిపడ్డారు.

విశాఖ బీచ్‌: నేవీ విన్యాసాల్లో భయంకరమైన ఘటన.. వీడియో చూస్తే షాక్ అవుతారు!