లోకేశ్ కు నాయకత్వ లక్షణాలు లేవు..: ఎంపీ విజయసాయిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.చంద్రబాబుకు తెలిసింది దగా, మోసం మాత్రమేనని విమర్శించారు.

పక్కా ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.చంద్రబాబు పాపం పండిందన్న అందుకే జైల్లో ఉన్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టును ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు.జాతీయ నేతలు కూడా చంద్రబాబుకు మద్ధతు ఇవ్వడం లేదన్నారు.

నారా లోకేశ్ కు నాయకత్వ లక్షణాలు లేవని విమర్శించారు.తప్పు చేశారు కాబట్టే చంద్రబాబు అరెస్ట్ అయ్యారని స్పష్టం చేశారు.

అటు పురంధేశ్వరి నిలకడలేని రాజకీయ నాయకురాలన్నారు.ఆమెకు సిద్ధాంతాలు కానీ, నైతిక విలువలు కానీ లేవని విమర్శలు చేశారు.

అంతేకాకుండా పురంధేశ్వరి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

నెయ్యితో ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా పెంచుకోండిలా!