“లోకేష్ -డబుల్ సెంచరీ” లక్ష్యం సాధించిందా ?

ప్రత్యేక మైలురాయి సాధించినసందర్భంగా లోకేష్( Nara Lokesh ) పాదయాత్ర తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుందా ? అంటే మిశ్రమ స్పందనే కనిపిస్తుంది.

పార్టీ శ్రేణులను ఉత్తేజితం చేసి కార్యకర్తలను తిరిగి పార్టీలో యాక్టివేట్ చేయడం అనే కోణంలో ఆలోచిస్తే తెలుగుదేశం యువగళం పాదయాత్ర( Yuvagalam Padayatra ) విజయం సాధించిందనే చెప్పాలి.

ముఖ్యంగా స్తబ్దంగా ఉన్న కార్యకర్తల్లో ఒక ఊపు తీసుకొచ్చిన ఘనత యువగళం పాదయాత్రకు దక్కుతుంది .

చాలా చోట్ల అధికార పార్టీతో పోరాడటానికి ధైర్యం సరిపోని కార్యకర్తలకు ఎన్ని కేసులు వచ్చినా తాను చూసుకుంటాను అన్న భరోసాని నింపడం లో మాత్రం లోకేష్ విజయవంతమయ్యారు.

అయితే అదే సమయంలో ప్రభుత్వాన్ని మార్చాలి అనే కోరిక ప్రజలకు కలిగించే స్థాయిలో ఉత్తేజo నింపడంలో మాత్రం లోకేష్ ఒక మెట్టు వెనకబడ్డారనే చెప్పాలి .

ముఖ్యంగా ప్రజల సమస్యలను హైలెట్ చేస్తూ అధికార పార్టీని దించి టిడిపిని( TDP ) మళ్లీ అధికారం లోకి తీసుకు వస్తే తప్ప పరిస్థితి మారదు అన్న వాతావరణం, ఆ నమ్మకం లోకేష్ ఇవ్వలేకపోయారనే చెప్పవచ్చు.

ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి( CM Jagan ) చేసిన పాదయాత్ర స్థాయిలో లోకేష్ ది ప్రభావం చూపించలేకపోయింది .

ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబులా( Chandrababu Naidu ) లోకేష్ డక్కా మొక్కీలు తిన్న నేత కాదు.

ఇప్పటివరకు వ్యక్తిగతంగా ఆయన సాధించిన విజయాలు కూడా లేకపోవడంతో ఆయనను ఒక సాధారణ నేతగానే చంద్రబాబు వారసుడగానే ప్రజలు చూశారు.

"""/" / అయితే తెలుగుదేశానికి భవిష్యత్తు అధినేత తానేనని కార్యకర్తలకు ప్రజలకు ఒక సందేశాన్ని అయితే యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ ఇచ్చారు .

చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు అని ప్రచారం జరుగుతున్నందున తెలుగు దేశం వారసత్వాన్ని దాని పార్టీ అధ్యక్ష స్థానానికి తానే సర్వాధికారిని అని లోకేష్ అయితే స్పష్టంగా ప్రకటించేశారు.

వచ్చే ఎన్నికలకు టికెట్లు కేటాయింపు దగ్గర నుంచి అభ్యర్థులు ఎంపిక ప్రచార బాధ్యతలు పూర్తిగా లోకేష్ కనుసనల్లోనే చంద్రబాబు దర్శకత్వ పర్యవేక్షణలో జరగనున్నట్లుగా తెలుస్తుంది.

"""/" / 2029 ఎన్నికలకు( 2029 Elections ) చంద్రబాబుకు 80 సంవత్సరాలు నిండుతాయి కాబట్టి వయోభారం రీత్యా రాజకీయంగా యాక్టివ్ గా ఉండే అవకాశం లేనందున లోకేష్ ని అన్ని విధాలుగా సమర్థవంతంగా ట్రైన్ చేసి పూర్తిస్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పచెబుతారని ప్రచారం జరుగుతుంది.

డిస్టింక్షన్ మార్కులు రాకపోయినప్పటికీ లోకేష్ తన యువగళం పాదయాత్రతో పాస్ మార్కులు అయితే సంపాదించుకున్నట్లుగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు .

భర్త పిల్లలు లేక మందు డ్రగ్స్ కి అలవాటు పడిన స్టార్ హీరోయిన్.. ఆమె ఆస్తి అంతా..??