లోకేష్ నిర్ణ‌యంతో సోమిరెడ్డికి పెద్ద షాక్ త‌గిలిందిగా..!

అభ్య‌ర్థుల ఎంపిక‌పై చంద్ర‌బాబు త‌న‌యుడు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి వ‌రుస‌గా మూడు సార్లు ఓడిపోయిన నేత‌ల‌కు ఈ సారి టిక్కెట్ ఇచ్చే అవ‌కాశం లేదిని చిన‌బాబు స్ప‌ష్టం చేశాడు.

దీనిపై పార్టీ అధినేత‌, నేత‌ల‌తో చ‌ర్చ జ‌రుగుతోంద‌ని అన్నారు.అలాగే పార్టీ ఎవ‌రికీ ప‌దవులు ఏళ్ల త‌ర‌బ‌డి ఇక‌పై ఉండ‌బోవ‌ని.

త‌ను కూడా అందుకు మిన‌హాయింపు కాద‌ని అన్నాడు.దీంతో టీడీపీ వ‌ర్గాల్లో గుబులు స్టార్ట్ అయింది.

ఒంగోలులో జ‌రిగిన తెలుగు దేశం పార్టీ మ‌హానాడు వేడుక‌ల్లో లోకేష్ చేసిన‌ వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌కు తెర‌లేపాయి.

కాగా పార్టీలో సీనియ‌ర్ల‌కు ఈ నిర్ణ‌యం మిగ్గుడుప‌డ‌టం లేదు.పార్టీలో తీసుకువ‌స్తున్న మార్పులు, సంస్క‌ర‌ణ‌లు కొంద‌రికి గుబులు పుట్టిస్తోంది.

గ‌తంలో కూడా ఇలాంటి ప్ర‌తిపాద‌న తీసుకువ‌చ్చినా సీనియ‌ర్లు ఎక్కువ‌గా ఉండ‌టంతో అమ‌లుకు సాధ్య‌ప‌డ‌లేదు.

మ‌రో సారి ఆ టాఫిక్ తో టీడీపీ రాజ‌కీయాలు వేడెక్కాయి.మ‌హానాడు వేదిక‌గా చంద్ర‌బాబు యువ‌త‌కు 40 శాతం సీట్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో కాక రేగుతోంది.

కాగా చిన‌బాబు ప్ర‌తిపాద‌న‌లతో ప‌లువురు సీనియ‌ర్లు ఆయోమ‌యంలో ఉన్నారు. """/"/ కాగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఇప్ప‌టికే ఐదు సార్లు పోటీ చేసి ఓడిపోయారు.

కాగా స‌ర్వేప‌ల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డిపై వ్య‌తిరేక‌త ఉంద‌ని ఈ సారి ఎలాగైనా గెలుస్తాన‌నే న‌మ్మ‌కంతో సోమిరెడ్డి ఉన్నారు.

ప్ర‌స్తుతం ఈ ప్ర‌తిపాద‌న‌ల‌తో సోమిరెడ్డి ఆశ‌లు ఆవిరి అయ్యేలా ఉన్నాయి.కాగా సోమిరెడ్డి కుమారుడు నియోజ‌క‌వ‌ర్గంలో యాక్టీవ్ గా ఉన్నాడు.

ఒక‌వేళ సీనియ‌ర్ల‌కు సీట్లు కేటాయించ‌క‌పోతే సోమిరెడ్డి కుమారుడికి సీటు కేటాయించే సూచ‌న‌లు ఉన్నాయి.

ఎందుకంటే యువ‌త‌కు 40 శాతం ఈ సారి అవ‌కాశం ఇస్తామ‌ని అధినేత చెప్పిన విష‌యం తెలిసిందే.

"""/"/ అయితే కాకాణిని ఎదుర్కోవాలంటే సోమిరెడ్డి పోటీ చేస్తేనే బాగుంటుద‌నే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

అలాకాకుండా కుమారుడికి సీటు కేటాయిస్తే ఇక సోమిరెడ్డి సీనియ‌ర్ నేత‌గా ప‌ద‌వులు చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్న‌ప్ప‌టికీ ఇక ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరం అవుతారు.

కాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల వేళ ఈ ప్ర‌తిపాద‌న‌లు అమ‌లు చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.

Chandrababu : ఏపీ భవిష్యత్ కోసమే మూడు పార్టీల పొత్తు..: చంద్రబాబు