ఇలా అయితే కష్టం బాస్ ! నిజమేనా చిన బాస్ ?

పార్టీ బలం పుంజుకోవాలి.పార్టీ కొత్త రక్తం ఎక్కించాలి.

యువ నాయకత్వాన్ని ఎక్కువుగా ప్రోత్సహించాలి .జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.

పదే పదే ఈ తరహా డైలాగులు తెలుగుదేశం పార్టీలో వినిపిస్తూ ఉంటాయి.  అధినేత చంద్రబాబు దగ్గర నుంచి పార్టీలోని సీనియర్ నాయకులంతా ఇదే తరహాలో డైలాగులు చెబుతూ ఉంటారు.

అయితే క్షేత్రస్థాయిలో మాత్రం దానికి తగ్గట్లుగా పనితీరు లేకపోవడంతో వైసిపి ప్రభుత్వం ను ఇరుకున పెట్టే అవకాశం వచ్చినా, టిడిపి దానిని చేజేతులా నాశనం చేసుకుంటోంది.

చిన్న విషయానికి కూడా రియాక్ట్ అవుతూ ఎక్కువగా స్పందిస్తూ ఉండడంతో, సీరియస్ విషయంలో జనాలు పెద్దగా టిడిపి వాదనలను పట్టించుకోవడం లేదు.

ఇక ఇప్పటికే పార్టీ కేడర్ చెల్లాచెదురైంది నాయకులు ఎవరూ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ముందుకు రావడం లేదు.

కేసుల భయం తో పాటు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాలనే భయము టిడిపి నేతలను వెంటాడుతోంది.

పోనీ నాయకులలో భరోసా కల్పించే విధంగా సరికొత్త కార్యక్రమాలు రూపొందిస్తూ, పార్టీ జనాలకు అందుబాటులో ఉంటున్నారా అంటే అది లేదు.

కరోనా వైరస్ ప్రభావం సాకుతో ఎక్కువగా హైదరాబాద్కే లోకేష్ ,చంద్రబాబు పరిమితమై పోతున్నారు.

అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా ట్విట్స్ చేస్తూ, జూమ్ మీటింగ్ ద్వారా పార్టీలోని కొంతమంది కీలక నాయకులకు బాబు అందుబాటులో ఉంటున్నారు.

అయితే క్షేత్రస్థాయిలో నాయకులకు అందుబాటులో ఉంటే ఆ ఉత్సాహమే వేరు.  ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉంటూ ఇక్కడి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.

వైసిపి పదే పదే విమర్శలు చేస్తున్న  టిడిపి క్యాడర్ లో ఏ ఉత్చహం కనిపించడం లేదు.

"""/"/ పోనీ చంద్రబాబు వయసు రీత్యా హైదరాబాదులోనే ఉంటున్నారు అనుకున్నా, టిడిపి రాజకీయ వారసుడు,  భవిష్యత్తులో పూర్తిగా పార్టీ నడిపించాల్సిన లోకేష్ సైతం సోషల్ మీడియా కే పరిమితం అయిపోతున్నారు.

కేవలం కొంతమంది యువ నాయకులతో తప్ప, మెజారిటీ నాయకులకు లోకేష్ నాయకత్వంపై నమ్మకాలే లేవు.

అలాగే టీడీపీ అనుకూల మీడియా లో వైసీపీ ప్రభుత్వం పై అదేపనిగా విమర్శలు చేస్తూ వస్తుండటం,  దీనికి టిడిపి వంత పాడుతూ ఉండటం తదితర కారణాలతో ఒకరకంగా వైసీపీ పై సానుభూతి జనాల్లో పెరిగిపోతోంది.

ఈ విషయాలన్నీ చంద్రబాబుకు తెలియనివి కావు.  40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఇటువంటి వ్యవహారాలు ఎన్నో చూశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో బాబు ఏవి పట్టించుకోనట్లు గానే వ్యవహరిస్తున్నారు.అన్ని బాధ్యతలు లోకేష్ కె అప్పగించినట్లుగా గత కొంత కాలంగా టిడిపిలో పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండడంతో  పార్టీ కేడర్ లో మరింతగా నిరుత్సాహం అలుముకుంది.

విజయ్ దేవరకొండ ఆ సినిమా చేసి పెద్ద తప్పు చేశాడా..?