దేశ స్వతంత్ర పోరాటంలో గణేష్ మండపాలు ఎలాంటి కీలక పాత్ర పోషించాయో మీకు తెలుసా.?
TeluguStop.com
బ్రిటీష్ పాలకుల నుండి దేశాన్ని విముక్తి చేయడానికి మన దేశ ప్రజలు అనేక రకాల పోరాటాలు చేశారు.
అతివాద,మితవాద, గాంధేయవాద అంటూ మూడు రకాలుగా విభజించుకున్న భారత స్వాతంత్ర్య ఉద్యమంలో .
గణేష్ ఉత్సవాలదీ కీలక పాత్ర.! కాదేదీ పోరాటానికి అనర్హం అనే రీతిలో బాలగంగాధర తిలక్ గణేష్ ఉత్సవాలను ఫ్రీడమ్ వార్ కోసం ఉపయోగించుకున్న తీరు చాలా చాకచక్యంతో కూడుకున్నది.
1893కు ముందు వినాయక చవితిని ఇళ్ళలోనే జరుపుకునేవారు.గణేషుని విగ్రహాలు పెట్టడం, నిమజ్జనం చేయడం ఉండేవి కావు.
అప్పటి బ్రిటీష్ పాలకులు అమలుచేసే చట్టాలు సైతం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవిగా ఉండేవి.
ముగ్గురు,నలుగురు కలిసి బయట తిరగడానికి భయపడేవారు.సామూహికంగా ఎటువంటి కార్యక్రమాలు జరపడానికి అవకాశం ఉండేవి కాదు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఈ పరిస్థితిని గట్టెక్కించడానికి, స్వాతంత్ర్యోద్యమాన్ని రగల్చడానికి.వినాయక వేడుకలే సరైన మార్గమని ఆలోచించిన తిలక్.
వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించడం, భజనలు, పూజలు చేయడం లాంటి కార్యక్రమాలకు తెరతీశారు.( అంతర్లీనంగా స్వాతంత్ర్యోద్యమ కాంక్షను రగల్చడం ఈ వేడుకల ఉద్దేశ్యం.
)! ఈ కార్యక్రమంలో భక్తులు సామూహికంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.ప్రజల నుండి కూడా విశేష స్పందన లభించింది.
దీంతో ఆంగ్లేయులకు ఏమిచేయాలొ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.! రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటే చర్యలు తీసుకోవచ్చు కానీ మత,ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలను నిర్బంధించడం ఎలా? అనే డైలమాలో పడిపోయారు బ్రిటీష్ పాలకులు.
మరోవైపు గణపతి దేవుని సాక్షిగా స్వాతంత్ర్య ఉద్యమం ఊపందుకుంది.మొదట భజనలు, తర్వాత స్వాతంత్ర్య కోసం ఏం చేయాలంటూ చర్చలు.
ఇలా గణపతి మండపాలు.ఉద్యమానికి మంచి వేదికలుగా మారాయి.
కేవలం హిందువులే కాక ఇతర మతస్థులు సైతం ఈ కార్యక్రమాలకు హాజరయ్యి స్వాతంత్ర్యపోరాటం కోసం ఏం చేయాలో తమ తమ ఆలోచనలు పంచుకున్నారు.
అలా స్టార్ట్ అయిన గణపతి వేడుకలు 1894 నుండి సర్వసాధారణమయ్యాయి.
యోగి ఆదిత్యనాథ్‌ను ఆకట్టుకున్న ఇటాలియన్ మహిళలు.. ఏం చేశారో చూడండి!