రేపటి నుండి కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు…ప్రకటించిన లోక్ సభ స్పీకర్..!!

ఈరోజుతో పాత పార్లమెంటు భవనం సేవలు ముగిశాయి.రేపటి నుంచి కొత్త పార్లమెంట్ భవనం( New Parliament Building )లో సమావేశాలు నడుస్తాయని లోక్ సభ స్పీకర్ హోమ్ బిర్లా( Lok Sabha Speaker Om Birla ) ప్రకటించారు.

సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలో ప్రారంభమయ్యాయి.ఈ క్రమంలో తొలిరోజు చివరి నిమిషంలో.

సభ ముగించే ముందర స్పీకర్ ఓం బిర్లా ఈ విషయం సభ్యులకు తెలియజేయడం జరిగింది.

అనంతరం సభని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి రేపటి నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు.

కాగా కొత్త పార్లమెంట్ భవనంలో మంగళవారం ఉదయం గణపతి పూజ( Ganapathi Pooja ) చేస్తారని తర్వాత మధ్యాహ్నం లోక్ సభ 1:15 నిమిషాలకు, రాజ్యసభ 2:15 నిమిషాలకు ప్రారంభం కాబోతుందట.

ఈ కొత్త పార్లమెంట్ భవనంలో మొదట మహిళా రిజర్వేషన్ బిల్లునీ ఆమోదం పొందేలా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి గతంలో ఎన్నో పార్టీలు ప్రయత్నాలు చేయగా చివరకి కొత్త పార్లమెంటు భవనంలో మొదలు కాబోయే సమావేశాలలో బుధవారం ఆమోదం పొందుకోబోతున్నట్లు సమాచారం.

భారతీయ సాంప్రదాయ ప్రకారం ఏదైనా గృహప్రవేశ కార్యక్రమాలలో స్త్రీలకు పెద్దపీట వేయడం జరుగుద్ది.

దాని దృష్టిలో పెట్టుకుని ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఈ కొత్త పార్లమెంట్ భవనంలో ఆమోదింప చేయనుందని సమాచారం.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ వచ్చేసిందిగా.. ఆ టైటిల్ తో దబిడి దిబిడే!