Lok Sabha Elections : లోక్సభ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదల
TeluguStop.com
లోక్సభ ఎన్నికలకు( Lok Sabha Elections ) తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ మేరకు తొలి విడతలో 21 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం( Election Commission Of India ) తెలిపింది.
దేశ వ్యాప్తంగా సుమారు 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది.కాగా ఈ తొలిదశ నోటిఫికేషన్( First Phase Of Notification ) జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
నామినేషన్లను దాఖలు చేసేందుకు ఈ నెల 27వ తేదీ వరకు సమయం ఉండగా.
ఈ నెల 28న నామినేషన్ల పరిశీలన జరగనుంది.అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 30 వరకు గడువు ఉంది.
తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19న నిర్వహించనుండగా.జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
పుష్ప2 సాధించిన రికార్డును బ్రేక్ చేసే దమ్ముందా.. ఈ రికార్డ్స్ సులువు కాదంటూ?