లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా కేసిఆర్ కీలక సూచనలు

గత కొంత కాలంగా బెడ్ రెస్ట్ లోనే ఉంటున్న బీఆర్ఎస్ అధినేత,  తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే జనాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకునే విధంగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.

దీనిలో భాగంగానే పార్టీ కీలక నేతలతో తాజాగా సమావేశం నిర్వహించిన కేసీఆర్ కీలక సూచనలను చేశారు.

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ ఎంపీలంతా విభజన హామీలు అమలుతో పాటు,  రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసిఆర్ సూచించారు.

తెలంగాణలో హక్కుల కోసం పోరాడే పార్టీ బీ ఆర్ ఎస్( BRS Party ) మాత్రమేనని,  వారం రోజుల పాటు జరిగే సమావేశాల్లో పార్టీ ఎంపీలంతా ఆయా అంశాలపై మాట్లాడి కేంద్రాన్ని నిలదీయాలని కేసీఆర్ సూచించారు.

"""/" /  తెలంగాణ నీటి వనరులను గుప్పెట్లో పెట్టుకునేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు,  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు.

కేసీఆర్( KCR ) అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్ ఈ సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కె .కేశవరావు,  నామా నాగేశ్వరావు,  కేటీఆర్,  హరీష్ రావు తదితరులు పాల్గొన్నారు.

నది జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు,  పెండింగ్ లో ఉన్న రాష్ట్ర విభజన హామీల సాధన కోసం బీఆర్ఎస్ ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసిందని కేసీఆర్ గుర్తు చేశారు.

తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే  సందర్భంలో అడ్డుకొని రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ ఎంపీలపై ఉందని కేసీఆర్ సూచించారు.

"""/" / 450 కోట్ల విడుదలకు సంబందించి ఎన్ హెచ్ ఐ ఏ సాయంతో ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణ, రాష్ట్రంలో ఐఐఎం, 23 నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి ప్రస్తావించాలని సూచించారు.

లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha Elections ) పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఈ భేటీలో ఎటువంటి ప్రస్తావన రాలేదు.

కాకపోతే ఎన్నికలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ కీలక సూచనలు చేశారు.

డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ లెక్కలివే.. అన్ని కోట్లు వస్తే హిట్టవుతుందా?