ఎన్ఆర్ఐ ఓటర్లకు ట్రావెల్ ఏజెంట్ల ఆఫర్.. ఫ్లైట్ బుకింగ్స్‌పై 50 శాతం డిస్కౌంట్
TeluguStop.com
భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల ఫీవర్ నడుస్తున్న సంగతి తెలిసిందే.ఏడు విడతల ఎన్నికల్లో ఇప్పటికే పలు విడతలు ముగిశాయి.
కోట్లాది మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఇదిలావుండగా.
స్వదేశంలో ఎన్నికల పండుగలో భాగం పంచుకోవాలని ప్రవాస భారతీయులు ఉవ్విళ్లూరుతున్నారు.ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివస్తున్నారు .
ఇలాంటి వారిని మరింత ప్రోత్సహించేందుకు పంజాబ్‌కు చెందిన ట్రావెల్ ఏజెంట్లు( Travel Agents ) నడుం బిగించారు.
జూన్ 1న పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ( Lok Sabha Elections In Punjab )జరగనుంది.
ఈ నేపథ్యంలో విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వదేశానికి వస్తే వారికి 50 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి జలంధర్ నగరానికి చెందిన ట్రావెల్ ఏజెన్సీలు.
జూన్ 1 నుంచి జూన్ 7 మధ్య ఫ్లైట్ బుకింగ్ సర్వీస్ చార్జీలపై 50 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించాయి.
అలాగే ఐఈఎల్‌టీఎస్ కేంద్రాలు( IELTS Centers ) కూడా తమ ఫ్రాంచైజీని వినియోగించుకునేందుకు నెలవారీ ఫీజుల్లో 50 శాతం మినహాయింపును ప్రకటించాయి.
"""/" /
70 శాతం ఓటింగ్ లక్ష్యాన్ని అధిగమించేందుకు గాను ఓటరును చైతన్యపరిచే ప్రచారంలో భాగంగా ఈ ఆఫర్‌లు అందించబడ్డాయి.
ఎంపిక చేసిన ట్రావెల్ ఏజెంట్లు, ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్ల నుంచి డిస్కౌంట్ పొందవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, డిప్యూటీ కమీషనర్ డాక్టర్ హిమాన్షు అగర్వాల్ వెల్లడించారు.
జలంధర్‌లో దాదాపు 1000కి పైగా చిన్నా, పెద్ద ఐఈఎల్‌టీఎస్, ఇతర ఇంగ్లీష్ ప్రొఫిషీయన్సీ సెంటర్స్ వున్నాయి.
ఇక్కడి నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్ధులు పరీక్షలు రాసి, ప్రతి యేటా విదేశాలకు వలస వెళ్తుంటారు.
"""/" /
ట్రావెల్ ఏజెంట్లు, ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్‌లు, మేనేజర్‌లు, ఐఈఎల్‌టీఎస్ సెంటర్ల యజమానులతో హిమాన్షు అగర్వాల్ సమావేశం నిర్వహించారు.
జూన్ 1 తర్వాత విదేశీ పర్యటనలను ప్లాన్ చేసుకునేలా తమ క్లయింట్లను ప్రోత్సహించాలని.
ఎన్ఆర్ఐలు డిస్కౌంట్ ద్వారా ఓటింగ్ కోసం జలంధర్‌కు వచ్చేలా చూడాలని డిప్యూటీ కమీషనర్ కోరారు.
ఓటర్లు, ముఖ్యంగా యువత తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రోత్సహించేలా అధికార యంత్రాంగం ఈ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తోందన్నారు.
రవితేజ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్…