కేంద్రంలో వార్ వన్ సైడ్ అంటున్న ఎగ్జిట్ పోల్స్ లెక్కలు.. మళ్లీ ఆ పార్టీదే అధికారమా?

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు పూర్తి కావడంతో ఈరోజు సాయంత్రం 6.

30 గంటల నుంచి అన్ని ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడిస్తున్నాయి.

మెజారిటీ సర్వే సంస్థలు కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారమని చెబుతున్నాయి.ఐదేళ్లలో కేంద్రంలో కాంగ్రెస్ పెద్దగా పుంజుకోలేదని సర్వేల లెక్కల ద్వారా అర్థమవుతోంది.

రిపబ్లిక్ పీ మార్క్ లెక్కల ప్రకారం ఎన్డీయే కూటమి( NDA Alliance ) 354 స్థానాల్లో విజయం సాధించనుండగా ఇండియా కూటమి 154 స్థానాల్లో ఇతరులు 30 స్థానాల్లో విజయం సాధించనున్నాయి.

ఇండియా న్యూస్ డీ డైనమిక్స్ ( Exit Poll India News-D Dynamics )లెక్కల ప్రకారం ఎన్డీయే కూటమి 371 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉండగా ఇండియా కూటమి మాత్రం 125 స్థానాలకు పరిమితం కానుందని తేలింది.

ఇతరులు 47 స్థానాల్లో గెలుస్తారని ఈ సంస్థ పేర్కొంది.రిపబ్లిక్ భారత్ మ్యాట్రిజ్ అంచనాల ప్రకారం ఎన్డీయే కూటమి ఏకంగా 353 నుంచి 368 స్థానాల్లో సత్తా చాటనుండగా ఇండియా కూటమి 118 నుంచి 133 స్థానాల్లో సత్తా చాటనుంది.

ఇతరులు 43 నుంచి 48 స్థానాల్లో గెలుస్తారని ఈ సంస్థ వెల్లడించింది. """/" / జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం మాత్రం ఎన్డీయే కూటమి 362 నుంచి 392 స్థానాల్లో విజయం సాధించనుండగా ఇండియా కూటమికి 141 నుంచి 161 స్థానాల్లో అనుకూల ఫలితాలు రానున్నాయి.

10 నుంచి 20 స్థానాల్లో ఇతరులు గెలుస్తారని ఈ సంస్థ తెలిపింది.న్యూస్ నేషన్ లెక్కల ప్రకారం ఎన్డీయే కూటమి ఏకంగా 342 నుంచి 378 స్థానాల్లో గెలవనుంది.

ఇండియా కూటమి 153 నుంచి 169 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉండగా ఇతరులు 21 నుంచి 23 స్థానాల్లో విజయం సొంతం చేసుకోనున్నారు.

"""/" / దైనిక్ భాస్కర్ ఎన్డీయే కూటమి 281 నుంచి 350 స్థానాలకు పరిమితం అవుతుందని ఇండియా కూటమి 145 నుంచి 201 స్థానాల్లో విజయం సొంతమవుతుందని తెలిపింది.

33 నుంచి 49 స్థానాల్లో ఇతరులకు ఛాన్స్ ఉంది.సీ.

ఎన్.ఎక్స్ లెక్కల ప్రకారం కూటమి 371 నుంచి 401 స్థానాల్లో గెలవనుండగా ఇండియా కూటమి 109 నుంచి 139 స్థానాల్లో అనుకూల ఫలితాలు పొందనున్నాయి.

28 నుంచి 38 స్థానాల్లో ఇతరులు గెలిచే అవకాశాలు ఉన్నాయి.న్యూస్ 18 సంస్థ( News18 ) లెక్కల ప్రకారం 355 నుంచి 370 స్థానాల్లో ఎన్డీయే కూటమి విజయ ప్రభంజనం కొనసాగనుందని ఇండియా కూటమి 125 నుంచి 140 స్థానాల్లో సత్తా చాటనుందని తెలుస్తోంది.

42 నుంచి 52 స్థానాల్లో ఇతరులకు ఛాన్స్ ఉంది.

రికార్డుల కోసం కల్కి సినిమా తీయలేదు.. స్వప్న దత్ కామెంట్స్ వైరల్!