Ziplineలో చేరిన టెస్లా మాజీ సీఎఫ్‌వో… ఎవరీ దీపక్ అహుజా..?
TeluguStop.com
డ్రోన్ డెలివరీ, లాజిస్టిక్స్ స్టార్టప్ ‘జిప్‌లైన్’తొలి చీఫ్ బిజినెస్, ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా భారత సంతతికి చెందిన మాజీ టెస్లా సీఎఫ్‌వో దీపక్ అహుజాను నియమించుకుంది.
దీనికి ముందు ఆల్ఫాబెట్ హెల్త్‌కేర్ యూనిట్ వెరిలీ లైఫ్ సైన్సెస్‌లో పనిచేశారు అహుజా.
సెప్టెంబర్ 30 నుంచి జిప్‌లైన్‌లో ఆయన తన కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు.జిప్‌లైన్ వ్యాపారం.
ప్రభుత్వం, వినియోగదారుల కోసం అతిపెద్ద ఇన్‌స్టంట్ లాజిస్టిక్స్, డెలివరీ సిస్టమ్‌ను డిజైన్ చేస్తోందని అహుజా పేర్కొన్నారు.
టెస్లాలో వుండగా సీఎఫ్‌వో హోదాలో ఆయన కంపెనీకి లాభాలను అందించే విషయాలను పర్యవేక్షించారు.
టెస్లా వ్యవస్థాపకుడు , సీఈవో ఎలోన్ మస్క్ తన ఎలక్ట్రిక్ కార్లను భారతదేశానికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నప్పుడు 2019లో అహుజా నిష్క్రమణ టెస్లాను ఒక కుదుపుకు గురిచేసింది.
టెస్లాను భారత్‌లోకి అనుమతిస్తారా.వద్దా అన్న దానిపై వాటాదారుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు అహుజా రెండు సార్లు భారతదేశాన్ని సందర్శించారు.
"""/" /
అహుజాకు ఫోర్డ్ మోటార్ కంపెనీలో 15 ఏళ్ల అనుభవం వుంది.
ఆటో పరిశ్రమలో ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్‌గా.2008లో టెస్లా మోటార్స్ తొలి సీఎఫ్‌వోగా దీపక్ బాధ్యతలు స్వీకరించారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీహెచ్‌యూ) నుంచి సిరామిక్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని, నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన రాబర్ట్ ఆర్ మెక్ కార్మిక్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్స్ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు.
కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.రవాణా, ఆరోగ్య రంగాలలో అహుజా దశాబ్ధాల అనుభవాన్ని ఉపయోగించుకుంటానని జిప్‌లైన్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు కెల్లర్ రినౌడో అన్నారు.
వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు కొత్త వర్గాలకు మద్ధతు ఇవ్వడం, దీర్ఘకాలిక వ్యాపార వ్యూహాలను అమలు చేయడం వంటి అంశాలపై అహుజా ట్రాక్ రికార్డ్ ప్రభావాన్ని చూపుతుందన్నారు.
ఏడేళ్ల తర్వాత అనుకోని చోట.. పాత ఫ్రెండ్స్ రీయూనియన్.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!