వైరల్ వీడియో: ఇంకా మారారా.. ట్రైన్ ముందు నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చిన మహిళ.. చివరకి..
TeluguStop.com
ఈ మధ్యకాలంలో చాలామంది సెల్ఫీలు( Selfie ) అంటూ వారి ప్రాణాలను పణంగా పెట్టి సాహసాలను చేస్తున్నారు.
ఇలా చేస్తున్న సమయంలో చాలామంది చివరికి వారి ప్రాణాలను కూడా కోల్పోవడం సంబంధించిన వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ముఖ్యంగా వాహనాలు తిరిగే రోడ్లపై, అలాగే రైల్వే ట్రాక్ లపై( Railway Track ) సాహసాలు లేదా సెల్ఫీలు తీసుకోవడం లాంటి ప్రయత్నంలో ఇప్పటికే చాలామంది ప్రాణాలను కూడా కోల్పోయారు.
కొద్దిరోజుల క్రితం ఓ మహిళ రైల్వే ట్రాక్ దగ్గరగా ఉండి వెనకాల ట్రైన్ తో సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో ట్రైన్ కు దగ్గరగా వెళ్ళింది.
అయితే అదే సమయంలో ట్రైన్ చాలా వేగంగా వచ్చి ఆమె తలను ఒక్కసారిగా ఢీకొట్టడంతో అంతదూరం ఒక్కసారిగా ఎగిరిపడి క్షణాలలో పరలోకనికి చేరింది.
తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించి మరో వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
"""/" /
కాస్త వింటేజ్ కాలంలో ఉండే రైలు మాదిరిగా ఉన్న ఓ రైలు ఇంజనీన్ చూసి ఓ మహిళ వీడియో, ఫోటోలు తీసుకోవాలని భావించింది.
అందుకోసం ఆవిడ రైలు పట్టాల పక్కనే నించొని ఉండగా మరొక వ్యక్తి ఆమెను ఫోటోలు తీస్తున్నాడు.
అయితే ఆ రైలు ఇంజన్ ముందర ఒక పైలట్ నిలబడి ఉన్నాడు.మహిళ అక్కడ నిలబడి ఉండడాన్న గమనించిన లోకో పైలెట్( Loco Pilot ) రైలును నిదానంగా పోనిచ్చాడు.
అలా ఆ అమ్మాయికి దగ్గరగా వచ్చిన తర్వాత రైలింజన్ మీద ఉన్న ఆ వ్యక్తి ఒక్కసారిగా తన కాలును ముందుకి పెట్టి ఆ అమ్మాయిని పక్కకు ఒక్కతోపు తోసేసాడు.
దీంతో ఆ మహిళ భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. """/" /
ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
రైలు దగ్గర ఇలాంటి పనులు చేస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అందుకు సంబంధించిన వీడియోలు చూస్తూనే ఉంటారు.
మళ్ళీ ఇలా పనికిమాలిన పనులు చేస్తారంటూ ఆ మహిళపై కొందరు ఘాటుగా స్పందిస్తుంటే.
మరికొందరేమో., రైలు మీద ఉన్న వ్యక్తి చాలా మంచి పని చేశాడు అంటూ అతనిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీల్ చైర్ లో నటి రష్మిక మందన్న…షాక్ లో అభిమానులు!