బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణలో లాక్ డౌన్ పొడగింపు.. !!
TeluguStop.com
తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రంగా మారిన నేపధ్యంలో మే 12 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
కాగా ప్రజల అవసరార్ధం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్ నియమాలను మినహయించారు.
కానీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని వర్తక, వ్యాపారాలు, కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు.
కాగా సమయం మించిన తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతి ఇవ్వడంలేదు.
ఇక రెండో దఫా లాక్ డౌన్ పొడింగించినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధలను మరింత కఠినంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే ఈ లాక్‌డౌన్ గడువు రేపటితో ముగియనుండటంతో మరోసారి తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా అని ఇప్పటి వరకు ప్రజలు ఆసక్తితో ఎదురు చూశారు.
కాగా నేడు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అయ్యి లాక్‌డౌన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.
ఇందులో భాగంగా ఈ లాక్‌డౌన్ ను జూన్ 15 వరకు పొడగించగా, ఉదయం 6 నుండి 1 గంట వరకు మాత్రం లాక్ డౌన్ నుండి మినహాయింపు ఇచ్చారు.
ఇకపోతే వీకెండ్ లో మాత్రం సంపూర్ణంగా లాక్‌డౌన్ పాటించాలని నిర్ణయించారట.