కేరళలో మే 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..!

కరోనా సెకండ్ వేవ్ కేసులను నియంత్రించడానికి వివిధ రాష్ట్రాలు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.

కేరళలో కూడా లాక్ డౌన్ కొనసాగుతుంది.అయితే ఈ లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగిస్తూ సిఎం పినరయ్ ఆదేశాలు జారీ చేశారు.

త్రిపుల్ లాక్ డౌన్ విధించిన తిరువనంతపురం, ఎర్నాకులం, త్రిశూర్, మలప్పురం జిల్లాల నుండి మూడు నిల్లాలను మినహాయించారు.

ఒక్క మలప్పురంలో మాత్రం త్రిపుల్ లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నారు.అక్కడ కేసులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నాలుగు జిల్లాల్లో కేరళ ప్రభుత్వం త్రిపుల్ లాక్ డౌన్ విధించింది.

మే 16 నుండి 23 వరకు లాక్ డౌన్ పెట్టారు.కేసులు పెరుగుతున్న కారణంగా లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించారు.

గడిచిన 24 గంటల్లో కేరళలో 29,673 కేసులు నమోదు అయ్యాయని తెలుస్తుంది.ఇక 41,032 మంది కరోనా నుండి కోలుకున్నారు.

142 మంది ప్రాణాలు కోల్పోయారని సిఎం తెలిపారు.ఇక తెలంగాణా రాష్ట్రంలో కూండా మే 12 నుండి 21 వరకు లాక్ డౌన్ విధించగా రెండు రోజుల ముందే లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగిస్తూ ప్రకటించారు తెలంగాణా సిఎం కే.

సి.ఆర్.

యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు ప్రశాంత్ నీల్ అదిరిపోయే తీపికబురు.. అలా చెప్పి షాకిచ్చారుగా!