ముప్పు ముంచుకొస్తోందే ? మూడో దశ దాటితే ?

లాక్ డౌన్ నిబంధన చాలా రోజులుగా కొనసాగుతోంది.ప్రజలు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రాకుండా బాగానే కంట్రోల్ చేస్తున్నా, రోజురోజుకు మనదేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది.

ఇప్పటికే 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.కరోనా కట్టడి కోసం అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ యంత్రాంగం తమ శక్తికి మించి కష్టపడుతున్నారు.

దేశంలో రెండో విడత విధించిన లాక్ డౌన్ కమ్యూనిటీ ట్రాన్సిషన్ అడ్డుకునేందుకు ఉద్దేశించింది.

ఈ దశ చాలా కీలకమని ఇప్పటికే వైద్య వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

మూడో స్టేజ్ గా పిలవబడే ఈ దశను కొన్ని అగ్రరాజ్యాలు పట్టించుకోకపోవడంతో తీరని నష్టాన్ని చవిచూశాయి.

ఎవరి నుంచి కరోనా వైరస్ సోకిందో తెలియకపోవడమే మూడో దశ.మొదటి దశలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారు, రెండో దశలో వారి నుంచి ఈ వ్యాధి సోకిన వారు, మూడో దశలో అసలు ఎవరు ఈ వైరస్ వ్యాప్తి చెందిస్తున్నారు అనేది తెలియక పోవడం.

ఈ దశ కనుక విజయవంతంగా ఎదుర్కోకపోతే నాలుగో దశలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతుంది.

మరణాలు శాతం అదుపు చేయలేని విధంగా ఉంటాయి.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆ సంఖ్య రోజురోజుకు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి.

రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ లుగా, వైరస్ కట్టడికి వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి.

ప్రభుత్వ యంత్రంగం కూడా గట్టిగానే కష్టపడుతున్నా, కొన్ని జిల్లాల్లో కమ్యూనిటీ ట్రాన్సిషన్ నెమ్మదిగా మొదలైంది.

ఇప్పుడు అదే అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. """/"/ రెడ్ ,బఫర్ జోన్ లలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా, పూర్తి స్థాయిలో వీటిపై నిఘా పెంచారు.

అయితే ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా, తెలంగాణలోని సూర్యాపేటలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.

అక్కడ సుమారు 80 పాజిటివ్ కేసుల నమోదు అవ్వడం ఆందోళన కలిగిస్తోంది.మూడో దశ ను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది.

అయితే దీనిని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రజల్లోనే ఉంది.ఏదో వంకతో పదేపదే రోడ్లపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతుంది.

అప్పుడు కోలుకోలేని నష్టం చవి చూడాల్సిందే.

త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమాలో కీలక పాత్ర వహించనున్న మలయాళ సూపర్ స్టార్…