వైరల్ వీడియో: వరద దెబ్బకి బైక్‌తో సహా కొట్టుకుపోయిన యువకుడు.. రక్షించిన స్థానికులు..!

ప్రస్తుతం తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.వాగులు, వంకలు, నదులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి.

దీంతో గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.మరో వారం రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు( Heavy Rains ) పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించింది.బయటకు రాకపోవడం మంచిదని, ఇంట్లో సురక్షితంగా ఉండాలని సూచించింది.

"""/" / అయితే భారీ వర్షాలకు ఒక యువకుడు బైక్( Bike ) మీద కొట్టుకుపోయాడు.

యాదాద్రి జిల్లాలోని అడ్డగడూర్ మండలం గోవిందాపురం వద్ద నక్కల వాగు( Nakkala Vaagu ) అతి భారీ వర్షాలతో పొంగుతోంది.

దీంతో బైక్ పై వెళుతుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయాడు.అతడిని గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో కాపాడి బైటకు లాగారు.

అటు కన్నారం వాగులో బైక్ తో సహా మరో వ్యక్తి కొట్టుకుపోయాడు.హనుమకొండ - కన్నారం గ్రామానికి మహేందర్( Mahender ) అనే వ్యక్తి కన్నారం వాగు మీద బైక్ పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కన్నారం వాగులో పడి కొట్టుకుపోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.జాలర్ల సహాయంతో మహేందర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

"""/" / రాష్ట్రంలో పలుచోట్ల ఇాలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.వర్షాల దాటికి చెరువులు నండిపోయి రోడ్లపైకి నీరు చేరుకున్నాయి.

దీంతో గ్రామస్తులు వేరే ప్రాంతాలకు వాహనాల్లో వెళ్లడానికి వీలు పడటం లేదు.ఇక ఏదైనా అత్యవసరమై వేరే ప్రాంతానికి వెళ్లాలంటే అవస్థలు పడుతున్నారు.

జగిత్యాల జిల్లాలో ఓ గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి.అయితే చెరువు నిండిపోవడంతో ఆస్పత్రికి వెళ్లడానికి వీలు పడలేదు.

దీంతో స్థానిక సర్పంచ్ జేసీబీ సాయంతో గర్భిణీని చెరువు దాటించారు.అనంతరం ఆమెను అప్పటికే సిద్దం చేసి ఉన్న అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి4, శనివారం 2025