ఎమ్మెల్యేకు ఇల్లు లేదని కట్టించిన ఓటర్లు... చివరి వరకు ఇలాగే ఉంటే దేశంలోనే ఈ ఎమ్మెల్యే నిలిచి పోతాడు

మన దేశంలో రాజకీయాలు చాలా ఖరీదు అయ్యాయి.డబ్బున్న వారు మాత్రమే రాజకీయాలు చేయాలి, లేదంటే ఊరుకోవాలి అంటూ ఒక విధానం ఏర్పడింది.

డబ్బు లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయం వృదా అనే పరిస్థితి ఉంది.అయితే ఇంత పెద్ద దేశంలో ఒకటి రెండు చోట్ల మాత్రం ఇంకా వ్యవస్థ మారలేదు, డబ్బు లేకున్నా ఎన్నికల్లో గెలవచ్చు అని నిరూపితం అవుతుంది.

నిన్న మొన్న జరిగిన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి 5 లక్షల నుండి 50 లక్షల వరకు కూడా పెట్టి ఉంటారు అంటూ ప్రచారం జరుగుతుంది.

ఇలాంటి దారుణమైన రాజకీయాలు ఉన్న మన దేశంలో ఈ ఎమ్మెల్యే చాలా ప్రత్యేకంగా నిలుస్తున్నాడు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలోనే ఇంకా మూడు రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

ఎన్నికలు జరిగిన అన్ని ప్రాంతాల్లో కూడా డబ్బులు బాగా పెట్టారు.గెలిచిన వారు, ఓడిన వారు ఇద్దరు కూడా డబ్బులు దండిగా పెట్టారు.

ఎమ్మెల్యేగా నిలబడాలి అంటే కోటీశ్వరుడై ఉండాలి.కనీసం లక్షలైనా ఉండాలి.

కోట్లు, లక్షలు ఉండే వారికి ఇల్లు ఉండదా, బంగ్లాలే ఉంటాయి.కాని మద్యప్రదేశ్‌లో మొన్న గెలిచిన ఎమ్మెల్యే సీతారాం మాత్రం కనీసం పక్కా ఇల్లు కూడా కలిగి లేడు.

ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా ఆయన ఇల్లును కట్టుకోలేక పోయాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఎమ్మెల్యేగా గెలిచి రెండు నెలలు అయినా కూడా ఇంకా జీతం రాకపోవడంతో పాటు, లోనుకు ప్రయత్నిస్తే లోను కూడా రాకపోవడంతో ఇల్లు కట్టుకోలేక పోయాడు.

దాంతో భార్యతో కలిసి ఎమ్మెల్యే పూరి గుడిసెలోనే ఉంటున్నారు.దాంతో స్థానికులు తమ ఎమ్మెల్యే గుడిసెలో ఉంటే తమకే పరువు తక్కువ అనుకున్నారు.

దాంతో ఆ ఎమ్మెల్యేకు చందాలు వేసి మరీ ఇల్లు కట్టించారు.ఎమ్మెల్యేగా గెలిచి ఇంకా రెండు నెలలే అయ్యింది కనుక ఆయన వద్ద డబ్బులు లేవు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ రాబోయే అయిదు సంవత్సరాల్లో కూడా ఈ ఎమ్మెల్యే ఇలాగే ఉండి, డబ్బులు కూడబెట్టకుండా ఉంటే మాత్రం ఈయన దేశ చరిత్రలో నిలిచి పోతాడు.

కాని ఏ ఎమ్మెల్యే అయినా ఒక్కసారి పదవి వచ్చిందంటే లక్షలు, కోట్లు కూడబెట్టుకుంటున్నారు.

మరి ఈ ఎమ్మెల్యే సీతారం తన ఎమ్మెల్యే టర్న్‌ అయిపోయేప్పటికి ఎలాంటి స్థితిలో ఉంటాడో చూడాలి.

తనకు చందాలు వేసుకుని మరీ ఇల్లు కట్టించిన ఓటర్ల రుణం తీర్చుకుంటాడా, అందరు ఎమ్మెల్యేల మాదిరిగానే తాను మరిన్ని ఇల్లులు కట్టుకుంటాడా అనేది చూడాలి.

Purandhveswari : ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి..: పురంధ్వేశ్వరి