నవంబర్ 3న స్థానిక సెలవు.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన

మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక సెలవు ప్రకటించింది.నవంబర్ 3న సెలవు ప్రకటించేందుకు నల్గొండ, యదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లకు అనుమతిని ఇచ్చింది.

పోలింగ్ రోజుతో పాటు పోలింగ్ కేంద్రాలు ఉన్న కార్యాలయాలు, సంస్థలకు పోలింగ్ ముందు రోజు కూాడా సెలవు ఇవ్వాలని పేర్కొంది.

ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేసే కార్యాలయానికి లెక్కింపు రోజున కూడా సెలవు ఇవ్వాలని ఉత్తర్వుల్లో సర్కార్ స్పష్టం చేసింది.