కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి:జాజుల

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో సమగ్ర కులగణన ప్రక్రియ పూర్తి చేసి రిజర్వేషన్లు చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలోని అయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల సందర్భంగా గత ఆరు నెలలుగా కులగణన ఉద్యమం చేపట్టి,బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఆరు నెలల నుండి ఏకధాటిగా ఉద్యమించామన్నారు.కాంగ్రెస్ పార్టీ స్పందించి బీసీ సంఘాలతో చర్చలు జరిపి ఈ కులగణన అంశం మీద ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు.

హైదరాబాదులో జరిగినటువంటి 500 మంది బీసీ సంఘాల ప్రతినిధులు,బీసీ సంఘాల నాయకులు, విద్యార్థులు కుల సంఘాలు,మేధావులు పాల్గొనడం జరిగింది.

కుల గణన జరిగిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాం మూడు నాలుగు రోజుల్లోనే కుల గణనకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తామని,వారం రోజుల్లోనే తెలంగాణలో ఇంటింటి కుల గణన సర్వేను చేపడతానని ప్రభుత్వం చెప్పడంతో మేము సంతోషం వ్యక్తం చేశారు.

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీసీకు అధ్యక్ష పదవి ఇవ్వలేదని,రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని బీసీ బిడ్డను చేస్తారా అని కేసిఆర్ ను ప్రశ్నించారు.

బీసీల ఓట్లు కావాలంటే జాతీయస్థాయిలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.బీసీ అయిన మోడీ ప్రధానిగా ఉండి బీసీల పట్ల చిత్త శుద్ధి లేకపోవడం బాధాకరమన్నారు.

42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించకుంటే రానున్న రోజుల్లో బీసీ బిడ్డలు తిరగబడి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం రాజ్యాధికార ఉద్యమాలు చేపట్టి,బీసీ వ్యతిరేక పార్టీలను పాతరేయడం ఖాయమని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలకూరి కిరణ్,కందుల ప్రభాకర్ రెడ్డి,నక్క శ్రీను,పగిల్ల సత్యనారాయణ,జాజుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

పెళ్లికి పిలిచి అతిథులకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన దంపతులు..