ఏపీలో మరో ఆరునెలల పాటు స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా ?
TeluguStop.com
తాజాగా ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ల పాలన మరో ఆరు నెలలు పొడిగిస్తునట్లుగా జీవో ను తీసుకువచ్చింది.
అంటే ఏపీలో జెడ్పీ ఎంపిపి ల పాలన స్థానంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన జులై వరకు కొనసాగుతుంది.
మండల పరిషత్ లో జులై 3 వరకు జెడ్పీ లో జులై 4 వరకు స్పెషల్ అధికారుల పాలన కొనసాగుతుంది.
అందుకు కారణం స్థానిక ఎన్నికల పై అధికార పార్టీకి స్పష్టత లేకపోవడమే అని తెలుస్తుంది.
ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు.కావాలనే స్పెషల్ ఆఫీసర్ల పాలనను జగన్ పొడిగించారని ఆరోపిస్తున్నారు.
"""/"/
స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఎక్కడ ఓడిపోతామనే భయం వైసీపీలో మొదలైందని అంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల అంశం హై కోర్టులో ఉన్నప్పటికి కావాలనే ఎన్నికలను వాయిదా వేస్తుందని మండిపడుతున్నారు తాజాగా విడుదలైన జీవో ప్రకారం చూసుకుంటే ఆగష్టు లేదా సెప్టెంబర్ లో ఎన్నికలు పెట్టె ఆలోచనలో జగన్ సర్కారు ఉన్నట్లుగా తెలుస్తుంది.
పవర్ స్టార్ పవన్ బ్లాక్ బస్టర్ సినిమాను నయనతార రిజెక్ట్ చేసిందా.. అసలేమైందంటే?